ఏపీలో కరోనా @2,514

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. నెల రోజులుగా రోజూ అర్థ సెంచరీకి మించి కేసులు నమోదవుతూ రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఏపీలో గడచిన 24 గంటల్లో 62 మందికి సోకినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2,514కి చేరుకుందని ప్రకటించింది. ఏపీలో నిన్న 8,415 శాంపిళ్లను పరీక్షించారు. మరోవైపు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ కోలుకున్న 51 మంది డిశ్చార్జ్‌ అయ్యారని […]

Update: 2020-05-22 01:35 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. నెల రోజులుగా రోజూ అర్థ సెంచరీకి మించి కేసులు నమోదవుతూ రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఏపీలో గడచిన 24 గంటల్లో 62 మందికి సోకినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2,514కి చేరుకుందని ప్రకటించింది. ఏపీలో నిన్న 8,415 శాంపిళ్లను పరీక్షించారు. మరోవైపు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ కోలుకున్న 51 మంది డిశ్చార్జ్‌ అయ్యారని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసులు 2,514 కాగా, వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న యాక్టివ్ కేసులు 728 అని అధికారులు వెల్లడించారు. మరో 1,734 మంది కరోనా వైరస్ బారిన పడి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. నిన్న కృష్ణా జిల్లాలో ఒకరు కరోనా కారణంగా మృతి చెందడంతో ఇప్పటివరకూ ఈ మహమ్మారి కారణంగా 55 మంది మరణించారు.

Tags:    

Similar News