క్వారంటైన్‌లో పేకాట.. క్రీడాస్ఫూర్తి అంటూ ప్రశంసలు

దిశ, వెబ్‌డెస్క్: ‘తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే’ అన్న సామెతకు వీరు సరిగ్గా సరిపోతారేమో. క్వారంటైన్ సెంటర్లు, ఐసీయూల్లో పేషెంట్లు ప్రాణ భయంతో వణికిపోతుంటే కొంతమంది మాత్రం యోగ, ధ్యానం చేస్తూ తమ ప్రాణాల్ని నిలబెట్టుకుంటున్నారు. మరి కొందరు అయితే పాటలు వింటూ బెడ్‌పైనే డ్యాన్స్ వేస్తూ కరోనా అంటే భయం వద్దని ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. డాక్టర్లు సైతం పేషెంట్లలో ఉత్సాహాం నింపేందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. క్వారంటైన్ సెంటర్లో భౌతిక దూరం పాటిస్తూనే […]

Update: 2021-05-11 01:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే’ అన్న సామెతకు వీరు సరిగ్గా సరిపోతారేమో. క్వారంటైన్ సెంటర్లు, ఐసీయూల్లో పేషెంట్లు ప్రాణ భయంతో వణికిపోతుంటే కొంతమంది మాత్రం యోగ, ధ్యానం చేస్తూ తమ ప్రాణాల్ని నిలబెట్టుకుంటున్నారు. మరి కొందరు అయితే పాటలు వింటూ బెడ్‌పైనే డ్యాన్స్ వేస్తూ కరోనా అంటే భయం వద్దని ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. డాక్టర్లు సైతం పేషెంట్లలో ఉత్సాహాం నింపేందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. క్వారంటైన్ సెంటర్లో భౌతిక దూరం పాటిస్తూనే మంచి సందేశాలు ఇస్తున్నారు.

ఇటువంటి ప్రయోగాలు సాధారణం కానీ, ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోన్న ఓ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. క్వారంటైన్ సెంటర్‌లోనే కరోనా భయాన్ని పక్కనబెట్టి పేకాట ఆడుతున్నారు పేషెంట్లు. దీనికితోడు ఆట చూసేందుకు పలువురు పేషెంట్లు క్యూ కట్టడం గమనార్హం. ఏ మాత్రం భయం లేకుండా ఫోకస్ మొత్తం పేకాట మీద పెట్టారంటే క్రీడాస్ఫూర్తి అద్భుతం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పలువురు మాత్రం దీనిపై విమర్శలు కురిపిస్తున్నారు.

Tags:    

Similar News