కరోనా పేషెంట్లు.. c/o వైకుంఠధామం…

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: వైకుంఠధామం… ఇది మరణించిన వారి మృతదేహాలను ఖననం చేసేందుకు ఉపయోగించే ప్రదేశం… అటువంటి ప్రదేశానికి వెళ్లాలంటేనే భయం భయంగా ఉంటుంది.. కానీ కరోనా సోకిన జనం మాత్రం ఆ వైకుంఠ దాన్ని ఐసోలేషన్ సెంటర్ గా వాడుకుంటున్నారు… ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా నవపేట మండలం ఇష్టంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టంపల్లి తండాలో వెలుగు చూసింది. గత పది రోజుల క్రితం వివాహ వేడుకలలో పాల్గొన్న పలువురు తాండా వాసులకు […]

Update: 2021-05-17 14:37 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: వైకుంఠధామం… ఇది మరణించిన వారి మృతదేహాలను ఖననం చేసేందుకు ఉపయోగించే ప్రదేశం… అటువంటి ప్రదేశానికి వెళ్లాలంటేనే భయం భయంగా ఉంటుంది.. కానీ కరోనా సోకిన జనం మాత్రం ఆ వైకుంఠ దాన్ని ఐసోలేషన్ సెంటర్ గా వాడుకుంటున్నారు… ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా నవపేట మండలం ఇష్టంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టంపల్లి తండాలో వెలుగు చూసింది. గత పది రోజుల క్రితం వివాహ వేడుకలలో పాల్గొన్న పలువురు తాండా వాసులకు కరోనా పాజిటీవ్ అని తేలింది. పాజిటీవ్ ఉన్న వారి కోసం తాండలో ఉన్న పాఠశాలను ఐసొల్యూషన్ కేంద్రంగా ఉపయోగించుకోవాలని గ్రామ సర్పంచ్, కొంతమంది తండావాసులు నిర్ణయించారు.

కానీ ఆ పాఠశాల తాండాకు సమీపంలో ఉండడం వల్ల వృద్ధులు పిల్లలకు సైతం వైరస్ వచ్చే ప్రమాదం ఉందని కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. వైరస్ సోకిన ఏడు మంది కూడా తమ వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదని నిర్ణయించారు. తాండకు సమీపంలో నూతనంగా నిర్మించిన వైకుంఠ గ్రామంలో అన్ని వసతులు ఉండడం, సమీపంలోని గార్డెన్ ఉండడంతో వారు కరోనా నుండి కోలుకొవడానికి అనుకూలంగా ఉంటుందని గుర్తించారు. వైరస్ సోకిన వారు వైకుంఠధామం లో అన్ని రకాల వసతులు ఉండడంతో వారు అక్కడ ఉండటానికి అంగీకరించారు. గత ఐదు రోజుల నుండి వారు వైకుంఠ గ్రామంలోని నివాసముంటున్నారు. విద్యుత్తు, మంచినీటి సౌకర్యం తదితర వసతులతో పాటు, గార్డెన్ కూడా ఉండడంతో వారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటున్నారు.

ప్రశాంతంగా ఉన్నాం

వైకుంఠధామంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉంటున్నా రూ. అన్ని వసతులతో ఉన్న ఈ వైకుంఠధామం ఇంకా ప్రారంభం కాకపోవడం, ఇక్కడ ఇప్పటి వరకు శవాలకు అంత్యక్రియలు నిర్వహించే కార్యక్రమాల నిర్వహించకపోవడంతో ఎటువంటి భయం లేకుండా ప్రశాంతంగా ఉన్నామని కరోనా బాధితులు తెలుపుతున్నారు.

ఎప్పటికప్పుడు పరిశీలన

వైకుంఠధామంలో ఉంటున్న వారి పరిస్థితులను గ్రామసర్పంచ్ శ్రీనివాసులు, ఆశా వర్కర్లు ప్రతిరోజు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వారికి కావాల్సిన ఆహారం, మందులు అందజేస్తున్నారు. తమ ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడుతుందని అక్కడ ఉన్నవారు మీడియాకు వెల్లడించారు.

ఆరా తీసిన అధికారులు

కొత్తగా నిర్మించిన వైకుంఠధామాన్ని ఐసోలేషన్ సెంటర్‌గా వాడుకుంటున్న విషయాన్ని తెలుసుకొని అధికారులు ఈ విషయంపై ఆరా తీశారు. తమకు ఏ ఇబ్బందులు లేవని, మాకు కావాల్సిన ఆహారం, మందులను ఆశా కార్యకర్తలు, సర్పంచ్ అందజేస్తున్నారు. మాకు పూర్తి ఆరోగ్యం చేకూరే వరకు ఇక్కడే ఉంటామని చెప్పడం విశేషం.

Tags:    

Similar News