ఆక‌ల‌వుతోంద‌న్నా… అన్నం పెడ్తలేరు

దిశ‌, పాలేరు: ఖ‌మ్మం రూర‌ల్ మండ‌లం మద్దులపల్లి కోవిడ్ కేంద్రంలో బాధితులు ఆందోళ‌న‌కు దిగారు. వైద్య సిబ్బంది త‌మ‌కు స‌రైన ఆహారం ఇవ్వ‌డం లేద‌ని ఆరోపిస్తూ ఆదివారం సాయంత్రం ఆరు బ‌య‌ట బైఠాయించారు. త‌మ‌ను క‌నీసం మ‌నుషులుగా కూడా చూడ‌టం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విష‌యం తెలుసుకున్న రూర‌ల్ స్టేష‌న్ ఎస్సై రాము అక్క‌డికి చేరుకుని బాధితుల‌తో మాట్లాడి స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే గ‌తంలో కూడా వైద్య సిబ్బంది స‌రైన ఆహారం, మంచినీళ్లు ఇవ్వ‌డం […]

Update: 2020-08-16 09:48 GMT

దిశ‌, పాలేరు: ఖ‌మ్మం రూర‌ల్ మండ‌లం మద్దులపల్లి కోవిడ్ కేంద్రంలో బాధితులు ఆందోళ‌న‌కు దిగారు. వైద్య సిబ్బంది త‌మ‌కు స‌రైన ఆహారం ఇవ్వ‌డం లేద‌ని ఆరోపిస్తూ ఆదివారం సాయంత్రం ఆరు బ‌య‌ట బైఠాయించారు. త‌మ‌ను క‌నీసం మ‌నుషులుగా కూడా చూడ‌టం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విష‌యం తెలుసుకున్న రూర‌ల్ స్టేష‌న్ ఎస్సై రాము అక్క‌డికి చేరుకుని బాధితుల‌తో మాట్లాడి స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే గ‌తంలో కూడా వైద్య సిబ్బంది స‌రైన ఆహారం, మంచినీళ్లు ఇవ్వ‌డం లేద‌ని పేర్కొంటూ రెండుసార్లు ఆందోళ‌న‌కు దిగారు. అప్పుడు ఎస్సై రాము స‌ర్ది చెప్ప‌డంతో బాధితులు ఆందోళ‌న విర‌మించారు. వైద్య సిబ్బందిలో మార్పు రాక‌పోవ‌డంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రూర‌ల్ ఎస్సై రోగుల‌ను ఎంత సముదాయించినా, తమకు ఉన్నతాధికారులు, మంత్రి అజ‌య్ నుంచి స్ప‌ష్ట‌మైన హామీ వ‌స్తేగాని ఆందోళ‌న విర‌మించ‌మ‌ని భీష్మించుకుని కూర్చున్నారు.

Tags:    

Similar News