కరోనా రోగులు కనిపించడం లేదు..
దిశ, వెబ్‌డెస్క్: యూపీలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. కరోనా కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఘాజీపూర్‌లో కరోనా సోకిన 42 మంది కనిపించకుండా పోయారు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కరోనా టెస్టుల సమయంలో 42 మంది తప్పుడు వివరాలు సమర్పించారని అధికారులు వెల్లడించారు. శాంపిళ్ల సేకరణ సమయంలో వీరు ల్యాబ్‌లకు తప్పుడు ఫోన్ నెంబర్లు, అడ్రస్‌లు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌కు అడిషనల్ చీఫ్ […]
దిశ, వెబ్‌డెస్క్: యూపీలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. కరోనా కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఘాజీపూర్‌లో కరోనా సోకిన 42 మంది కనిపించకుండా పోయారు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కరోనా టెస్టుల సమయంలో 42 మంది తప్పుడు వివరాలు సమర్పించారని అధికారులు వెల్లడించారు. శాంపిళ్ల సేకరణ సమయంలో వీరు ల్యాబ్‌లకు తప్పుడు ఫోన్ నెంబర్లు, అడ్రస్‌లు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు.
ఈ మేరకు అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌కు అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (ఎసీఎంవో) డాక్టర్ కెకె వర్మ లేఖ రాశారు. ‘కొవిడ్-19 పాజిటివ్ వచ్చిన 42 మంది ఆచూకీ తెలియడంలేదని అందులో పేర్కొన్నారు. “పరీక్షల సమయంలో కొంతమంది సరైన మొబైల్ నెంబర్, చిరునామాను ఇవ్వడం లేదు. ఒకవేళ వారికి పాజిటివ్ వస్తే, వారిని కనుగొనడం తమకు కష్టమవుతుంది” అని అధికారులు వివరించారు. కాగా, ఘాజీపూర్ జిల్లాలో 505 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు వైరస్ బారిన పడి 10మంది చనిపోయారు.