కరోనా రోగి పరార్.. ఏపీ బేజార్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోగి పరారైన ఘటన ఆందోళణ రేకెత్తిస్తోంది. కొద్ది రోజుల క్రితం లండన్ ‌నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలుకు వచ్చిన నిందితుడి (20)కి కరోనా లక్షణాలు కనిపించాయి. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలోని అతనిని క్వారంటైన్‌లో ఉంచి చికిత్స ప్రారంభించారు. వైద్య పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాధిత యువకుడితో పాటు కరోనా ఆందోళనతో అతని తల్లిదండ్రులు, చెల్లెలు కూడా అదే వార్డులో చికిత్స పొందుతున్నారు. కాగా, సదరు యువకుడు […]

Update: 2020-03-19 06:36 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోగి పరారైన ఘటన ఆందోళణ రేకెత్తిస్తోంది. కొద్ది రోజుల క్రితం లండన్ ‌నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలుకు వచ్చిన నిందితుడి (20)కి కరోనా లక్షణాలు కనిపించాయి. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలోని అతనిని క్వారంటైన్‌లో ఉంచి చికిత్స ప్రారంభించారు. వైద్య పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాధిత యువకుడితో పాటు కరోనా ఆందోళనతో అతని తల్లిదండ్రులు, చెల్లెలు కూడా అదే వార్డులో చికిత్స పొందుతున్నారు. కాగా, సదరు యువకుడు కరోనా భయంతో ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కళ్లుగప్పి పరారయ్యాడు. దీంతో అతని కోసం పోలీసులు, వైద్యులు తీవ్రంగా గాలిస్తున్నారు. విద్యావంతుడైన యువకుడు పరారవ్వడం ఆందోళన రేపుతోంది. కరోనాను అతనెంతమందికి వ్యాప్తి చేస్తాడోనన్న ఆందోళణ సర్వత్రా వ్యక్తమవుతోంది.

Tags : ongole, coronavirus, ongole rims

Tags:    

Similar News