అంబులెన్స్‌లో కరోనా రోగి డెలివరీ

దిశ, వెబ్ డెస్క్: ఆమె నిండు గర్భిణి.. ఆపై కరోనా సోకింది. పుట్టబోయే బిడ్డ గురించి జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా చికిత్స తీసుకుంటుంది. ఇంతలోనే నిండు గర్భిణికి పురుటి నొప్పులు వచ్చాయి. సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది.. హుటాహుటిన వచ్చి ఆమెను తీసుకెళ్లారు. అయితే ఆమె అంబులెన్స్‌లోనే ప్రసవించింది. గర్భిణి ప్రసవంలో ముగ్గురు సిబ్బంది కీలక పాత్ర పోషించారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజానాథ్.. అంబులెన్స్ సిబ్బందిని […]

Update: 2020-08-13 06:09 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆమె నిండు గర్భిణి.. ఆపై కరోనా సోకింది. పుట్టబోయే బిడ్డ గురించి జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా చికిత్స తీసుకుంటుంది. ఇంతలోనే నిండు గర్భిణికి పురుటి నొప్పులు వచ్చాయి. సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది.. హుటాహుటిన వచ్చి ఆమెను తీసుకెళ్లారు. అయితే ఆమె అంబులెన్స్‌లోనే ప్రసవించింది. గర్భిణి ప్రసవంలో ముగ్గురు సిబ్బంది కీలక పాత్ర పోషించారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజానాథ్.. అంబులెన్స్ సిబ్బందిని అభినందించారు.

Tags:    

Similar News