కరోనా.. ఏం చేయాలి.. ఏం చేయకూడదు?

దిశ, వెబ్‌డెస్క్‌: కరోనా వైరస్ మహమ్మారి విజృంభించడంతో దేశంలో లాక్‌డౌన్ ప్రకటించారు. మంగళవారం నాటికి 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు షట్‌డౌన్‌కు వెళ్లాయి. నిత్యావసర వస్తువులు, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావడానికి పోలీసులు అనుమతిస్తున్నారు. దీంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటిలో కూర్చున్నంత మాత్రాన కరోనా బారిన పడలేం అని చెప్పలేం. ఈ క్రమంలో ఏం చేయవచ్చు.. ఏం చేయకూడదో తెలుసుకుందాం. చేయాల్సినవి తరుచూ చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోండి. సబ్బు లేదా […]

Update: 2020-03-24 04:36 GMT

దిశ, వెబ్‌డెస్క్‌: కరోనా వైరస్ మహమ్మారి విజృంభించడంతో దేశంలో లాక్‌డౌన్ ప్రకటించారు. మంగళవారం నాటికి 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు షట్‌డౌన్‌కు వెళ్లాయి. నిత్యావసర వస్తువులు, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావడానికి పోలీసులు అనుమతిస్తున్నారు. దీంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటిలో కూర్చున్నంత మాత్రాన కరోనా బారిన పడలేం అని చెప్పలేం. ఈ క్రమంలో ఏం చేయవచ్చు.. ఏం చేయకూడదో తెలుసుకుందాం.

చేయాల్సినవి

  • తరుచూ చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోండి. సబ్బు లేదా ఆల్కాహాల్‌ను వినియోగించి తయారు చేసిన శానిటైజర్లతో చేతులు కడుక్కోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల కరోనా బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
  • తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు నోటిని, ముక్కును హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూలతో కవర్ చేసుకోండి.
  • ఉపయోగించిన టిష్యూలను డస్ట్‌బిన్లలో మాత్రమే వేయండి.
  • జ్వరం, దగ్గు, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే డాక్టర్‌ను సంప్రదించండి. ఆ సమయంలో తప్పకుండా ముఖానికి మాస్క్ లేదా నోటికి, ముక్కుకు అడ్డుగా కర్చీఫ్ లేదా టిష్యూను పెట్టుకోండి.
  • కరోనా లక్షణాలు అంటే… జ్వరం, దగ్గు, జలుబు, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటే వెంటనే రాష్ట్ర హెల్ఫ్ లైన్ నంబర్ 104 లేదా కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్ఫ్ లైన్ నంబర్ 011-23978046లకు కాల్ చేయండి.
  • జలుబు లేదా జ్వరం వంటి లక్షణాలు ఉంటే ఇంటికే పరిమితంకండి.
  • జ్వరంతో బాధపడే వ్యక్తులకు అడుగు దూరంలో ఉండండి.
  • తగినంత సమయం నిద్ర, విశ్రాంతి తీసుకోండి.
  • నీరు లేదా పండ్ల రసాల వంటి పానీయాలను వీలైనంత ఎక్కువ తీసుకోండి. పౌష్టికాహారం తినండి.
  • రోజూ లైజాల్ వంటి ద్రావణాలతో ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసుకోండి.
  • ఇంట్లో ఎవరికైనా జ్వరం, దగ్గు ఉంటే ఆ వ్యక్తిని ఒక రూమ్‌లో ఐసోలేషన్‌లో ఉంచండి.

చేయకూడనివి..

  • జలుబు, దగ్గు ఉన్నప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోకుండా కళ్లు, ముక్కు, నోటిని తాకకండి.
  • ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకండి. హగ్గింగ్, కిస్సింగ్‌కు దూరంగా ఉండండి.
  • జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉన్న ఏ వ్యక్తికి అయినా సరే దూరంగా ఉండండి.
  • వీలైనంత వరకు కళ్లు, ముక్కు, నోరును తాకకుండా ఉండండి.
  • పబ్లిక్ స్థలాల్లో ఉమ్మకూడదు.
  • పెద్ద ఎత్తున గుమిగూడటం వంటివి చేయకండి.
  • జనాలు ఎక్కువగా ఉన్నచోటకు వెళ్లకండి.
  • వైద్యులను సంప్రదించకుండా సొంత వైద్యం చేసుకోకండి. న్యూస్ పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాలో చూసి, విని మందులు వేసుకోకండి. అది ప్రాణాలకే ప్రమాదమని గమనించండి.
  • ఉపయోగించిన న్యాప్కిన్లు, టిష్యూ పేపర్లను బహిరంగ ప్రదేశాల్లో పడేయకండి.
  • పబ్లిక్ ప్రదేశాలల్లో రేలింగ్, డోర్లు, గేట్లు వంటి వాటిని తాకకూడదు.
  • సెలువులు ఇచ్చింది అంటురోగం నుంచి దూరంగా ఉండటానికి. కాబట్టి పక్కింటి వారితో కూడా కాలక్షేపం కోసం మాట్లాడకుండా ఉండటం మంచింది.
Tags:    

Similar News