కరోనా నెగిటివ్ వచ్చిందని సంబరపడొద్దు..!
యావత్ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి గురించిన ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. కరోనా చికిత్స పొందిన వారి రక్త నమూనాల్లో నెగటివ్ వచ్చినప్పటికీ, ఆపై మరో ఎనిమిది రోజుల పాటు వైరస్ శరీరంలోనే తిష్ట వేసుకుని కూర్చుంటోందని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా వైరస్ జిత్తుల మారి నక్క వంటిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్’ వెల్లడించిన వివరాల ప్రకారం.. కోవిడ్ 19 బారిన పడి, […]
యావత్ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి గురించిన ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. కరోనా చికిత్స పొందిన వారి రక్త నమూనాల్లో నెగటివ్ వచ్చినప్పటికీ, ఆపై మరో ఎనిమిది రోజుల పాటు వైరస్ శరీరంలోనే తిష్ట వేసుకుని కూర్చుంటోందని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు.
కరోనా వైరస్ జిత్తుల మారి నక్క వంటిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్’ వెల్లడించిన వివరాల ప్రకారం.. కోవిడ్ 19 బారిన పడి, చికిత్స పొందాక, ఆ లక్షణాలు కనిపించక పోయినా, ఆపై మరో ఎనిమిది రోజుల పాటు వైరస్ వారి శరీరంలోనే దాగుందని గుర్తించినట్టు భారతీయ సంతతి శాస్త్రవేత్త లోకేశ్ శర్మ వెల్లడించారు. చైనాలోని కరోనా సోకిన రోగులపై చేసిన పరిశోధనల్లో ఈ విషయాన్ని గుర్తించినట్టు ఆయన
బీజింగ్ లోని పీఎల్‌ఏ జనరల్ హాస్పిటల్ లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 9 మధ్య వ్యాధికి చికిత్స పొందిన 16 మందిపై కరోనా రహస్యాలు తెలుసుకునేందుకు పరిశోధనలు నిర్వహించాని ఆయన చెప్పారు. ఈ కరోనా రోగుల నుంచి రోజు విడిచి రోజు రక్త నమూనాలు సేకరించామని లోకేశ్ శర్మ తెలిపారు. చికిత్స తరువాత వైరస్ లేదని నిర్ధారణ అయిన వారిలో సగం మందిలో మరో ఎనిమిది రోజులపాటు కరోనా వైరస్ దాగుందని ఆయన వెల్లడించారు.
చికిత్స పొందిన వారు మరికొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉండడమే మేలన్న అభిప్రాయాన్ని ఆయన వెల్లడించారు. పొరపాటున క్వారంటైన్‌లో లేకపోతే నిద్రాణ స్థితిలో ఉన్న వైరస్ మరోసారి యాక్టివేట్ అయి వారితో పాటు ఇరులకు కూడా ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిచారు. అందుకే చికిత్స తీసుకున్న అనంతరం 8 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ అవసరమని ఆయన తెలిపారు.
Tags: corona virus, covid-19, reserch in china, american journal of respiratory and critical care medicine