భూమి వైబ్రేషన్లపై లాక్‌డౌన్ ప్రభావం?

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రపంచ దేశాలు తమకు తాము విధించుకున్న లాక్‌డౌన్ భూమి వైబ్రేషన్లను కూడా ప్రభావితం చేస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రజలు తిరగకుండా ఇంట్లోనే ఉండటం, వాహనాల రొద, పరిశ్రమల పనులు లేకపోవడంతో భూమి అంతర్భాగంలో తక్కువ సైస్మిక్ వైబ్రేషన్లు వెలువడుతున్నాయని నేచర్ మేగజైన్ ప్రచురించింది. భూమ్మీద మానవుల రోజువారీ పనుల వల్ల నేల మీద వైబ్రేషన్స్ ఏర్పడి భూఅంతర్భాగం వరకు వెళ్తాయి. దీన్ని సైస్మిక్ నాయిస్‌గా పరిగణిస్తాయి. ఈ సైస్మిక్ […]

Update: 2020-04-06 05:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రపంచ దేశాలు తమకు తాము విధించుకున్న లాక్‌డౌన్ భూమి వైబ్రేషన్లను కూడా ప్రభావితం చేస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రజలు తిరగకుండా ఇంట్లోనే ఉండటం, వాహనాల రొద, పరిశ్రమల పనులు లేకపోవడంతో భూమి అంతర్భాగంలో తక్కువ సైస్మిక్ వైబ్రేషన్లు వెలువడుతున్నాయని నేచర్ మేగజైన్ ప్రచురించింది.

భూమ్మీద మానవుల రోజువారీ పనుల వల్ల నేల మీద వైబ్రేషన్స్ ఏర్పడి భూఅంతర్భాగం వరకు వెళ్తాయి. దీన్ని సైస్మిక్ నాయిస్‌గా పరిగణిస్తాయి. ఈ సైస్మిక్ నాయిస్ రీడింగులను బట్టే సునామీలు, భూకంపాలను శాస్త్రవేత్తలు గుర్తిస్తారు. భూఅంతర్భాగ వైబ్రేషన్లు కేవలం సముద్రం అడుగున ఉన్న భూకంపాల వల్లే కాకుండా భూఉపరితలం మీద జరుగుతున్న వివిధ కార్యకలాపాల వల్ల కూడా ప్రభావితమవుతాయి. ప్రస్తుతం ఉపరితలం మీద చాలా తక్కువ కదలికలు ఉండటం వల్ల ఈ సైస్మిక్ నాయిస్‌ని రికార్డు చేయడానికి పెట్టిన సైస్మిక్ స్టేషన్లు నిరుపయోగంగా ఉన్నాయని నేచర్ మేగజైన్ వెల్లడించింది.

Tags: Earth Vibrations, Lockdown,Corona,Quarantine, Crust

Tags:    

Similar News