‘కరోనా కట్టడి..అంతా రాముడి దయ’

లక్నో: సెకండ్ వేవ్‌తో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరప్రదేశ్‌లో వైద్యవ్యవస్థపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని వైద్య సదుపాయాల కొరతను పేర్కొంటూ నిస్సహాయంగా అంతా రాముడి దయ(సామెత) అనాల్సిందే అని పేర్కొంది. రాష్ట్రంలో కరోనా పేషెంట్లకు బెటర్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలన్న డిమాండ్‌తో దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తులు సిద్ధార్థ వర్మ, అజిత్ కుమార్‌ల ద్విసభ్య ధర్మాసనం విచారిస్తున్నది. చిన్న పట్టణాలు, గ్రామాల్లోని వైద్య వ్యవస్థ వివరాలను పరిశీలించి షాక్‌కు గురైంది. దేవుడిపైనే భారం అనే రీతిలో […]

Update: 2021-05-18 07:43 GMT

లక్నో: సెకండ్ వేవ్‌తో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరప్రదేశ్‌లో వైద్యవ్యవస్థపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని వైద్య సదుపాయాల కొరతను పేర్కొంటూ నిస్సహాయంగా అంతా రాముడి దయ(సామెత) అనాల్సిందే అని పేర్కొంది. రాష్ట్రంలో కరోనా పేషెంట్లకు బెటర్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలన్న డిమాండ్‌తో దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తులు సిద్ధార్థ వర్మ, అజిత్ కుమార్‌ల ద్విసభ్య ధర్మాసనం విచారిస్తున్నది. చిన్న పట్టణాలు, గ్రామాల్లోని వైద్య వ్యవస్థ వివరాలను పరిశీలించి షాక్‌కు గురైంది. దేవుడిపైనే భారం అనే రీతిలో వీటిని తీసుకోవాల్సి వస్తున్నదని అభిప్రాయపడింది. మీరట్ టౌన్‌లో ఏప్రిల్‌లో పేషెంట్ సంతోశ్ కుమార్ మిస్సింగ్ కేసుపై ముగ్గురు సభ్యుల కమిటీ సమర్పించిన రిపోర్టును పరిశీలించింది. ‘సంతోశ్ కుమార్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని, రెస్ట్‌రూమ్‌లో స్పృహ తప్పి పడిపోవడంతో స్ట్రెచర్‌పై తీసుకొచ్చి చికిత్స అందించారు.

కానీ, ఫలితం లేకపోయింది. ఆయన మరణించాడు. తర్వాత ఆయన గుర్తుతెలియని వ్యక్తిగా పరిగణించి బాడీని డిస్పోజ్ చేయడం నైట్ డ్యూటీ డాక్టర్ల నిర్లక్ష్యానికి పరాకాష్ట’ అని పేర్కొంది. గ్రామీణంలో వైద్య వసతులపై నిర్ఘాంతపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికలను పరిశీలిస్తూ ‘గ్రామీణంలో సాధారణ పరిస్థితుల్లోనే ప్రజలకు సరిపడా సదుపాయాల్లేవు. ఇక మహమ్మారి సమయంలో దాని కొరత చెప్పనవసరం లేదు. గ్రామీణంలో 32 లక్షల మంది ఉంటే, కేవలం 10 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లున్నాయి. అంటే ప్రతి 3 లక్షల మందికి 30 బెడ్లున్నాయన్నట్టు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందని ద్రాక్షలే’ అని వివరించింది. బిజ్నోర్ జిల్లాలో ఒక్క లెవెల్-3 హాస్పిటల్ కూడా లేదని, మూడు ప్రభుత్వా్స్పత్రుల్లో 150 పడకలు, కేవలం 5 వెంటిలేటర్లున్నాయని కోర్టు తెలిపింది.

Tags:    

Similar News