టీటీడీలో 91 మంది ఉద్యోగులకు కరోనా
దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ వాసులను బెంబేలెత్తిస్తోంది. సర్వాంతర్యామిలా దశదిశలా వ్యాపిస్తోంది. ఎక్కడ చూసినా కరోనా పాజిటివ్ కేసులు ప్రత్యక్షమవుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోనూ కరోనా వదల్లేదు. టీటీడీలో 91 మంది ఉద్యోగులకు కరోనా సోకిందని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. అలిపిరి వద్ద, తిరుమలలోనూ టీటీడీ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించామని, పెద్ద సంఖ్యలో యాత్రికులకు కూడా కరోనా టెస్టులు చేపట్టామని తెలిపారు. అయితే భక్తులెవరికీ కరోనా సోకలేదని స్పష్టం చేశారు. […]
దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ వాసులను బెంబేలెత్తిస్తోంది. సర్వాంతర్యామిలా దశదిశలా వ్యాపిస్తోంది. ఎక్కడ చూసినా కరోనా పాజిటివ్ కేసులు ప్రత్యక్షమవుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోనూ కరోనా వదల్లేదు. టీటీడీలో 91 మంది ఉద్యోగులకు కరోనా సోకిందని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. అలిపిరి వద్ద, తిరుమలలోనూ టీటీడీ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించామని, పెద్ద సంఖ్యలో యాత్రికులకు కూడా కరోనా టెస్టులు చేపట్టామని తెలిపారు. అయితే భక్తులెవరికీ కరోనా సోకలేదని స్పష్టం చేశారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారిలో 30 శాతం మంది తిరుమల యాత్ర రద్దు చేసుకున్నారని చెప్పారు. కాగా, టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించినట్టు సింఘాల్ తెలిపారు. తద్వారా వివాదాలకు తావు ఉండదని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు, ఈసారి స్వామివారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు టెండర్లు పిలుస్తున్నామని, అయితే అప్పటి పరిస్థితుల ఆధారంగా తుది నిర్ణయం ఉంటుందని చెప్పారు.