తూర్పుగోదావరి జిల్లాలో 87 పాజిటివ్ కేసులు

దిశ, ఏపీ బ్యూరో: తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వరుసగా నాలుగో రోజు భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజే అత్యధికంగా 87 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో గడిచిన 24 గంటల్లో 463 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ఒకరు, కడప జిల్లాలో ఒకరు మృతిచెందడంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య […]

Update: 2020-06-23 03:34 GMT

దిశ, ఏపీ బ్యూరో: తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వరుసగా నాలుగో రోజు భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజే అత్యధికంగా 87 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో గడిచిన 24 గంటల్లో 463 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ఒకరు, కడప జిల్లాలో ఒకరు మృతిచెందడంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య 119కి చేరుకుంది. కొత్తగా నమోదైన 462 కరోనా పాజిటివ్ కేసుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 40 మంది, విదేశాల నుంచి వచ్చినవారు 15 మంది ఉన్నారు. దాంతో ఇప్పటివరకు ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,834కి చేరింది. నిన్న ఒక్క రోజే వివిధ ఆస్పత్రుల్లో కరోనాకు చికిత్స పొంది 129 మంది కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్ చేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 4,592 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 5,123 మంది వివిధ ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు.

Tags:    

Similar News