జిల్లాకు 5000బెడ్స్ తో కరోనా ఆస్పత్రులు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ప్రతి జిల్లాకు 5 వేల పడకలతో కూడిన ప్రత్యేక కొవిడ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కొవిడ్ కంట్రోల్ రూమ్ నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు సీఎం నిర్ణయంపై వివరణ ఇచ్చారు. అలాగే, కేసులు పెరుతుండడంతో క్వారంటైన్ సెంటర్లలో మౌలిక వసతులు పెంచుతున్నామన్నారు. అలాగే కేవలం 15 నిమిషాల్లో కరోనా బాధితులు కొవిడ్ సెంటర్లకు చేరుకునేలా తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రతి జిల్లాలో […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ప్రతి జిల్లాకు 5 వేల పడకలతో కూడిన ప్రత్యేక కొవిడ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కొవిడ్ కంట్రోల్ రూమ్ నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు సీఎం నిర్ణయంపై వివరణ ఇచ్చారు. అలాగే, కేసులు పెరుతుండడంతో క్వారంటైన్ సెంటర్లలో మౌలిక వసతులు పెంచుతున్నామన్నారు. అలాగే కేవలం 15 నిమిషాల్లో కరోనా బాధితులు కొవిడ్ సెంటర్లకు చేరుకునేలా తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రతి జిల్లాలో 3000 వేల పడకలను 5 వేలకు అప్ గ్రేడ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. కరోనా బాధితులకు చికిత్స పరంగా అన్ని విధాలుగా ఆదకుంటున్నామని కృష్ణబాబు వివరణ ఇచ్చారు.