కరోనా సెలవులు.. యాదాద్రికి పోటెత్తిన భక్తులు

దిశ, నల్లగొండ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తుల రద్దీ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తగా ఈనెల 31 వరకు పాఠశాలలు, మాల్స్, సినిమా థియేటర్లకు సెలవు ప్రకటించడంతో జనాలు యాదగిరిగుట్టకు బాట పట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రూ.2వేల కోట్ల అంచనాలతో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపడుతున్న విషయం విధితమే. ఇందులో భాగంగా నాలుగేండ్లుగా యాదాద్రిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దీంతో నాలుగేళ్లకు ముందు, […]

Update: 2020-03-15 23:32 GMT

దిశ, నల్లగొండ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తుల రద్దీ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తగా ఈనెల 31 వరకు పాఠశాలలు, మాల్స్, సినిమా థియేటర్లకు సెలవు ప్రకటించడంతో జనాలు యాదగిరిగుట్టకు బాట పట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రూ.2వేల కోట్ల అంచనాలతో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపడుతున్న విషయం విధితమే. ఇందులో భాగంగా నాలుగేండ్లుగా యాదాద్రిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దీంతో నాలుగేళ్లకు ముందు, ప్రస్తుతానికి యాదాద్రిలో అభివృద్ధి రూపురేఖలు పూర్తిగా మారిపోవడంతో వీటిని చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే సుమారు 30వేల మంది భక్తులు దర్శనానికి వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ పరంపరా నేడూ (సోమవారం) కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీంతో స్వామివారి నిత్య ఆరాధనలు, నిత్య కళ్యాణాలు, నిత్య బ్రహ్మోత్సవాల టికెట్లకు గిరాకీ పెరిగింది. భక్తుల రద్దీ పెరుగుతుండడంతో ఆలయ అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంమీద కరోనా వైరస్ కారణంగా యాదాద్రి ఆలయం వేసవి సెలవుల కంటే ముందే భక్తులతో కళకళలాడుతోంది. భక్తుల రాకతో చిరు వ్యాపారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News