Home Secretary Ajay Kumar Bhalla: కరోనా మార్గదర్శకాలు పొడిగించిన కేంద్రం

దిశ, వెబ్‌డెస్క్: కరోనా రక్కసి సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జారీ చేసిన కరోనా మార్గదర్శకాలను జూన్ 30 వరకు పొడిగించింది. దేశంలో రోజువారి కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ, మహమ్మారి తిరిగి పుంజుకోకుండా రాష్ట్రాల్లో కరోనా కఠిన నిబంధనలు మాత్రం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆదేశాలు జారీ చేశారు. స్థానిక పరిస్థితి, అవసరాలు, వనరులకు అనుగుణంగా తమ రాష్ట్రాల్లో నిర్ణయం తీసుకోవాలని  […]

Update: 2021-05-28 00:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా రక్కసి సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జారీ చేసిన కరోనా మార్గదర్శకాలను జూన్ 30 వరకు పొడిగించింది. దేశంలో రోజువారి కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ, మహమ్మారి తిరిగి పుంజుకోకుండా రాష్ట్రాల్లో కరోనా కఠిన నిబంధనలు మాత్రం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆదేశాలు జారీ చేశారు.

స్థానిక పరిస్థితి, అవసరాలు, వనరులకు అనుగుణంగా తమ రాష్ట్రాల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మహమ్మారిని పూర్తిగా అధిగమించే విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. కరోనా కట్టడికి ప్రజలను చైతన్య పరుస్తూ క్షేత్రస్థాయి అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని వెల్లడించింది.

 

Tags:    

Similar News