గ్రామాలకు పాకుతున్న కరోనా

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా క్రమక్రమంగా గ్రామాలకు సోకుతుంది. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అధికంగా నమోదైన కరోనా కేసులు ప్రస్తుతం నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్ జిల్లాలో అధికంగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 965 కరోనా కేసులు నమోదుకగా ఈ స్థాయిలో గతేడాది నవంబర్ 25 న 935 కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో 62,581 మంది వ్యాక్సిన్ ను తీసుకున్నారు. కరోనా వ్యాది ఉదృతి రెట్టింపు స్థాయిలో పెరిగిపోతుంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికి రోజురోజుకు […]

Update: 2021-04-03 01:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా క్రమక్రమంగా గ్రామాలకు సోకుతుంది. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అధికంగా నమోదైన కరోనా కేసులు ప్రస్తుతం నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్ జిల్లాలో అధికంగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 965 కరోనా కేసులు నమోదుకగా ఈ స్థాయిలో గతేడాది నవంబర్ 25 న 935 కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో 62,581 మంది వ్యాక్సిన్ ను తీసుకున్నారు.

కరోనా వ్యాది ఉదృతి రెట్టింపు స్థాయిలో పెరిగిపోతుంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికి రోజురోజుకు కేసుల సంఖ్య ఊహించని రీతిలో పెరుగుతుంది. గతేడాది నవంబర్ నుంచి జనవరి వరకు తగ్గతూ వచ్చిన వ్యాది ఫిబ్రవరి నెలఖరు నుంచి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. మార్చి నెల మొదట్లో 40 లోపు నమోదైన కేసులు ఏప్రెల్ 1 నాటికి 1000కి చేరువలో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. గడిచిన 24గంటల్లో 965 కరోనా కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు ఆక్టీవ్ గా ఉన్న కేసుల సంఖ్య 6,159కి పెరిగింది. 5 మంది మృతిచెందగా ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 1706కి చేరుకుంది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 254, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 110, రంగారెడ్డిలో 97 కేసులు నమోదయ్యాయి.హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు జిల్లాలో కూడా అధికంగా కేసులు నమోదవుతున్నాయి. గ్రామాలకు కరోనా వ్యాది పాకుతుండటంతో నిజామాబాద్ లో 64, జగిత్యాలలో 35, కరీంనగర్ లో 29, నిర్మల్ లో 39, సంగారెడ్డిలో 29, కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కొత్తగూడెంలో 7, జయశంకర్ భూపాల పల్లిలో 7, జోగుళాంబ గద్వాలలో 5, మహబూబాబాద్ లో 7, ములుగులో 1, వరంగల్ రూరల్ లో 7 కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24గంటల్లో 62,581 మందికి వ్యాక్సిన్

గడిచిన 24గంటల్లో మొత్తం 62,581 మందికి కరోనా వ్యాక్సిన్ ను అందించారు. వీరిలో మొదటి డోసు తీసుకున్నవారు 59,439 ఉండగా 2వ డోసు తీసుకున్నవారు 3,142 మంది ఉన్నారు, దీంతో ఇప్పటి వరకు మొత్తం 10,84,429 మందికి మొదటి డోసు వ్యాక్సిన్ అందించగా రెండవ డోసును 2,42,178 మందికి అందించారు.

Tags:    

Similar News