రాజమహేంద్రవరం జైలులో 8 మంది రిమాండ్ ఖైదీలకు కరోనా

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొద్ది రోజుల నుండి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోని 8 మంది రిమాండ్ ఖైదీలు కరోనా బారినపడ్డారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్న ముగ్గురికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో శుక్రవారం మరో 8 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో ఐదుగురికి పాజిటివ్‌గా తేలినట్టు జైలు సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. […]

Update: 2021-04-02 20:51 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొద్ది రోజుల నుండి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోని 8 మంది రిమాండ్ ఖైదీలు కరోనా బారినపడ్డారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్న ముగ్గురికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.

దీంతో శుక్రవారం మరో 8 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో ఐదుగురికి పాజిటివ్‌గా తేలినట్టు జైలు సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. వారిని నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు ఆయన చెప్పారు. మరింత మంది ఖైదీలకు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.

 

Tags:    

Similar News