శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో కరోనా కలకలం.. ఆందోళనలో తల్లిదండ్రులు

దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా వైరస్ ఎవరిని  వదలడం లేదు. మహమ్మారి ప్రభావం తగ్గిందని అంతా భావించారు. కానీ విద్యాసంస్థలు మొదలవడంతో భారీగా పిల్లలకు సోకుతోంది. ఈ క్రమంలో బెంగళూరులోని శ్రీచైతన్య విద్యాసంస్థల్లో కొందరు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమయిన యాజమాన్యం స్కూల్ లో ఉన్న 480 మందికి టెస్టులు చేయించారు. ఇందులో దాదాపు 60 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యిందని బెంగళూరు అర్బన్​​ డిప్యూటీ కమిషనర్​ మంజునాథ్​ తెలిపారు. అయితే, […]

Update: 2021-09-29 02:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు. మహమ్మారి ప్రభావం తగ్గిందని అంతా భావించారు. కానీ విద్యాసంస్థలు మొదలవడంతో భారీగా పిల్లలకు సోకుతోంది. ఈ క్రమంలో బెంగళూరులోని శ్రీచైతన్య విద్యాసంస్థల్లో కొందరు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమయిన యాజమాన్యం స్కూల్ లో ఉన్న 480 మందికి టెస్టులు చేయించారు. ఇందులో దాదాపు 60 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యిందని బెంగళూరు అర్బన్​​ డిప్యూటీ కమిషనర్​ మంజునాథ్​ తెలిపారు. అయితే, ఇందులో ఇద్దరిలోనే లక్షణాలు(Covid symptoms) ఉన్నాయని, భయపడాల్సిందేమీ లేదని చెప్పారు. వైరస్ సోకిన విద్యార్థుల్లో 46 మంది కర్ణాటక వాసులు కాగా.. మిగిలిన 14 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని చెప్పారు. దీంతో విద్యాసంస్థను అక్టోబర్​ 20 వరకు మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

Tags:    

Similar News