కరోనా ఎఫెక్ట్… కటౌట్ల సమక్షంలో పెళ్లి
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి మూలంగా, సమస్త మానవాళి జీవితంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదివరకెన్నడూ కలలో కూడా ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నారు. ఆటలు, సినిమాలు, ఉద్యోగం, కుటుంబం, ఆర్థిక వ్యవస్థ ఇలా అన్నింటిపై ప్రభావం చూపుతూ మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేసింది. ఇందులో భాగంగానే ఎంతో వైభవంగా జరుపునే పెళ్లిళ్లపై కరోనా పంజా విసిరింది. సామాన్యుల నుంచి కోటీశ్వరుల వరకూ అందరి పెళ్లిళ్లు నిరాడంబరంగా జరుగుతున్నాయి. చుట్టాలు, అతిథులు సమక్షంలో హడావుడిగా వివాహాలు […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి మూలంగా, సమస్త మానవాళి జీవితంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదివరకెన్నడూ కలలో కూడా ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నారు. ఆటలు, సినిమాలు, ఉద్యోగం, కుటుంబం, ఆర్థిక వ్యవస్థ ఇలా అన్నింటిపై ప్రభావం చూపుతూ మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేసింది. ఇందులో భాగంగానే ఎంతో వైభవంగా జరుపునే పెళ్లిళ్లపై కరోనా పంజా విసిరింది. సామాన్యుల నుంచి కోటీశ్వరుల వరకూ అందరి పెళ్లిళ్లు నిరాడంబరంగా జరుగుతున్నాయి. చుట్టాలు, అతిథులు సమక్షంలో హడావుడిగా వివాహాలు జరిగేవి. కాగా ప్రస్తుతం కరోనా మూలంగా పెళ్లికి అతి తక్కువ సంఖ్యలో బంధువులు హాజరు కావడం, వారి కన్నా ఎక్కువగా కటౌట్లు దర్శనమిస్తున్నాయి.
తాజాగా యూకేకు చెందిన రోమనీ, సామ్ రోన్డ్యూ స్మిత్‌ల వివాహంయ జులైలో నిశ్చయం అయింది. కరోనా విస్తరిస్తుండటంతో ఆగస్టు 14కు వరకూ వాయిదా వేసింది. కరోనా అదుపులోకి వచ్చాక చేసుకుందాం అనుకుంటే.. అది ఇప్పట్లో పోయేలా లేదని పెళ్లికి సిద్ధపడ్డారు. ఆ జంట తమ పెళ్లిని కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో చేసుకోవాలని నిశ్చియించుకుంది. అయితే వారి ఆశల మీద కరోనా వైరస్ నీళ్లు జల్లింది. ఎవర్ని పిలిచినా నిరభ్యంతరంగా పెళ్లికి రాలేమని చెప్పేస్తున్నారు. దీంతో ఎవరూ లేకుండా పెళ్లి చేసుకోకుండా… చేసుకుంటే జీవితాంతం గుర్తుంచుకోవాలని వినూత్న ఆలోచన చేశారు. దీంతో వారి బంధువులు అందరూ పెళ్లి హాజరుఅయినట్టుగా, 48 మంది బంధువుల కటౌట్లను కార్డ్‌బోర్డులతో తయారు చేయించారు. వాటిని పెళ్లి వేదిక వద్ద ఏర్పాటు చేశారు. వాటి సమక్షంలో పెళ్లి చేసుకుని, అందరితో కలిసి ఫోటో దిగినట్లు పోజులు ఇచ్చారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు నెటిజన్లను బాగా అలరిస్తున్నాయి.