ప్రపంచవ్యాప్తంగా 11 వేలకు కరోనా మరణాలు
ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రపంచవాప్తంగా ఈ వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 11 వేలకు దాటింది. ఇక బాధితుల సంఖ్య 2.72 లక్షలకు చేరింది. ఇటలీలో కోవిడ్ సృష్టిస్తోన్న మారణహోమంతో చిగురుటాకుల వణికిపోతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 4,000 దాటింది. గడిచిన 24 గంటల్లో ఇటలీలో 627 మంది చనిపోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. బాధితుల సంఖ్య 47 వేలు దాటింది. ఇక ఇరాన్, స్పెయిన్, అమెరికాలోనూ […]
ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రపంచవాప్తంగా ఈ వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 11 వేలకు దాటింది. ఇక బాధితుల సంఖ్య 2.72 లక్షలకు చేరింది. ఇటలీలో కోవిడ్ సృష్టిస్తోన్న మారణహోమంతో చిగురుటాకుల వణికిపోతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 4,000 దాటింది. గడిచిన 24 గంటల్లో ఇటలీలో 627 మంది చనిపోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. బాధితుల సంఖ్య 47 వేలు దాటింది.
ఇక ఇరాన్, స్పెయిన్, అమెరికాలోనూ కరోనా మరణాలు పెరుగుతున్నాయి. ఇరాన్‌లో 1433, అమెరికాలో 200పైగా మృతుల సంఖ్య నమోదు అయింది. తాజాగా వైట్ హౌస్‌లో కరోనా కేసు నమోదు అయింది. ఉపాధ్యక్షుడి అధికారుల బృందంలోని ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.
Tags: corona, world, america, italy, spain