రాత్రి నుంచి వర్షంలోనే కోవిడ్ మృతులు

దిశ ప్రతినిధి, మెదక్: కరోనా మహమ్మారి మూలంగా ఎవరైనా చనిపోతే.. సొంత మనుషులే పరాయి వాళ్లలా చూస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి సోకే అవకాశం లేదని నిపుణులు ఎంత చెప్పినా ప్రజల్లో అవగాహన రావడం లేదు. తాజాగా కరోనా మృతుల పట్ల మరో అమాన వీయ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో గురువారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… నారాయణఖేడ్‌లో కరోనా తల్లి(65), కుమారుడు(35) నిన్న అర్ధరాత్రి సమయంలో సోఫాలో కూర్చొని అక్కడే […]

Update: 2020-08-13 05:49 GMT

దిశ ప్రతినిధి, మెదక్: కరోనా మహమ్మారి మూలంగా ఎవరైనా చనిపోతే.. సొంత మనుషులే పరాయి వాళ్లలా చూస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి సోకే అవకాశం లేదని నిపుణులు ఎంత చెప్పినా ప్రజల్లో అవగాహన రావడం లేదు. తాజాగా కరోనా మృతుల పట్ల మరో అమాన వీయ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో గురువారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… నారాయణఖేడ్‌లో కరోనా తల్లి(65), కుమారుడు(35) నిన్న అర్ధరాత్రి సమయంలో సోఫాలో కూర్చొని అక్కడే ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని బయట పడేశారు.

రాత్రి నుంచి వర్షం పడుతుండటంతో ఆ మృతదేహం నిన్నటినుంచి వర్షంలో తడుస్తూనే ఉంది. ఈ క్రమంలో గురువారం ఉదయం కరోనాతో తల్లి కూడా చనిపోయింది. అదే కుటుంబంలో మరి కొందరు వైరస్​ సోకి చికిత్స పొందుతున్నారు. దీంతో భయంతో కాలనీవాసులు తలుపులు వేసుకొని బయటకు రావడం లేదు, అధికారులు అటువైపే చూడటం లేదు. దీంతో ఆ మృతదేహాలు బయట వర్షంలోనే పడి ఉన్నాయి. చివరకు స్థానికుల విన్నపం మేరకు అధికారులు మృతదేహాలను తరలించి సానిటేషన్ నిర్వహించారు.

Tags:    

Similar News