ఏపీలో మరో 9 పాజిటివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తోంది. తాజాగా, రాష్ట్రంలో మరో 9 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 534కు చేరినట్టు తెలిపింది. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో కృష్ణా, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మూడు చొప్పున వెలుగులోకి వచ్చినట్టు పేర్కొంది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 14 మంది మృతి చెందినట్టు స్పష్టం చేసింది. జిల్లాల వారీగా కేసుల వివరాలను పరిశీలించినట్టైతే.. గుంటూరు […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తోంది. తాజాగా, రాష్ట్రంలో మరో 9 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 534కు చేరినట్టు తెలిపింది. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో కృష్ణా, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మూడు చొప్పున వెలుగులోకి వచ్చినట్టు పేర్కొంది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 14 మంది మృతి చెందినట్టు స్పష్టం చేసింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలను పరిశీలించినట్టైతే..
గుంటూరు 112, కర్నూలు 113, నెల్లూరు 58, ప్రకాశం 42, విశాఖ 20, తూర్పుగోదావరి 17, పశ్చిమ గోదావరి 34, కడప 36, అనంతపురం 21, కృష్ణా 48, చిత్తూరులో 23 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉండగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కేసూ నమోదు కాకపోవడం గమనార్హం.
Tags: corona cases, 525 register, ap, corona cases in ap