ఏపీలో తగ్గిన కరోనా కేసులు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 43,006 మందికి పరీక్షలు నిర్వహించగా 316మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,72,288కి చేరింది. 5మరణాలు సంభవించడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,038గా ఉంది. ప్రస్తుతం 5,626 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,59,624 మంది డిశ్చార్జయ్యారు. ఒక్కరోజులో 595మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,04,53,618మందికి శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. అనంతపురం జిల్లాలో 9కరోనా పాజిటివ్ […]

Update: 2020-12-07 06:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 43,006 మందికి పరీక్షలు నిర్వహించగా 316మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,72,288కి చేరింది. 5మరణాలు సంభవించడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,038గా ఉంది. ప్రస్తుతం 5,626 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,59,624 మంది డిశ్చార్జయ్యారు. ఒక్కరోజులో 595మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,04,53,618మందికి శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో 9కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 32, తూర్పుగోదావరిలో 55, గుంటూరులో 87, కడపలో 36, కృష్ణాలో 36, కర్నూలులో 4, నెల్లూరులో 25, ప్రకాశంలో 9, శ్రీకాకుళంలో 13, విశాఖపట్నంలో 12, విజయనగరంలో 3, పశ్చిమగోదావరిలో 15పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి.. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, కడప, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Tags:    

Similar News