ఈశాన్యంపై కరోనా పంజా..

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇన్ని రోజులు సైలంట్‌గా ఉన్న కరోనా ఇప్పుడు ఈశాన్య భారతంపై పంజా విసురుతోంది. తాజాగా మణిపూర్‌ రాష్ట్రంలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 192 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మణిపూర్‌లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,390కి చేరింది. అక్కడ 1,939 యాక్టివ్ కేసులుండగా 2,438 మంది కరోనా నుంచి […]

Update: 2020-08-15 10:07 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇన్ని రోజులు సైలంట్‌గా ఉన్న కరోనా ఇప్పుడు ఈశాన్య భారతంపై పంజా విసురుతోంది. తాజాగా మణిపూర్‌ రాష్ట్రంలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 192 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

మణిపూర్‌లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,390కి చేరింది. అక్కడ 1,939 యాక్టివ్ కేసులుండగా 2,438 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్చి అయ్యారు. వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 13కి చేరింది. ఆ రాష్ట్రంలో రికవరీ రేటు 55.53శాతంగా ఉందని ప్రభుత్వం వెల్లడించింది. కాగా, కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆగస్టు 31 వరకూ మణిపూర్ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News