ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 88,149 శాంపిల్స్ పరీక్షించగా 2,498 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19,44,222కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 24 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 13,178కి చేరింది. అదే సమయంలో 2,201 మంది కరోనా ఉంచి కోలుకోగా..ఇప్పటి వరకు […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 88,149 శాంపిల్స్ పరీక్షించగా 2,498 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19,44,222కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 24 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 13,178కి చేరింది. అదే సమయంలో 2,201 మంది కరోనా ఉంచి కోలుకోగా..ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,07,201కి పెరిగింది. ప్రస్తుతం 23,843 మంది చికిత్సపొందుతున్నారు.
కరోనా కేసుల విషయానికి వస్తే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 481 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 24 కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా మరణాల విషయానికి వస్తే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఐదుగురు మరణించారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,37,52,356 శాంపిల్స్‌ని పరీక్షించడం జరిగిందని ఏపీ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది.