ట్రిపుల్ ఐటీ కళాశాలలో కరోనా కలకలం..

దిశ, వెబ్ డెస్క్ : ఆంద్రప్రదేశ్ లో కరోనా మళ్లీ విజృంభించింది. ముఖ్యంగా విద్యా సంస్థలపై కరోనా పగపట్టింది. ఇప్పటీకే కరోనా కారణంగా పలు విద్యాసంస్థలకు బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ కళాశాలలో కరోనా కలకలం సృష్టించింది. ట్రిపుల్ ఐటీలోని పీ-2, ఈ-3 విభాగాలకు చెందిన పలువురు విద్యార్థులు కరోనా బారినపడ్డారు. విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ రెండు విభాగాలకు అధికారులు సెలవులు ప్రకటించారు. కరోనా సోకినా విద్యార్థులు […]

Update: 2021-04-11 04:42 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఆంద్రప్రదేశ్ లో కరోనా మళ్లీ విజృంభించింది. ముఖ్యంగా విద్యా సంస్థలపై కరోనా పగపట్టింది. ఇప్పటీకే కరోనా కారణంగా పలు విద్యాసంస్థలకు బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ కళాశాలలో కరోనా కలకలం సృష్టించింది. ట్రిపుల్ ఐటీలోని పీ-2, ఈ-3 విభాగాలకు చెందిన పలువురు విద్యార్థులు కరోనా బారినపడ్డారు. విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ రెండు విభాగాలకు అధికారులు సెలవులు ప్రకటించారు. కరోనా సోకినా విద్యార్థులు ఐసోలేషన్ లో ఉంచామని తెలిపారు. వారికి ఆన్ లైన్ పాఠాలు భోదిస్తున్నామని, మిగతా విభాగాలకు చెందిన విద్యార్థులకు యధావిధిగా తరగతులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News