వైజాగ్‌ను భయపెడుతున్న కరోనా.. వారికుందా?

చైనాలో పుట్టి ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా భారతదేశంలోకి ప్రవేశించి నెల రోజులు గడిచింది. కరోనా అనుమానితులను కేరళలో గుర్తించి వారికి చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత వారికి కరోనా తగ్గిందా? లేక కరోనా కారణంగా వారు మృత్యువాతపడ్డారా? అన్న వివరాలు మాత్రం తరువాత కనిపించలేదు. ఇదే సమయంలో కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా మృతి కేసులు నమోదయ్యాయి. చైనాలో అధికారికంగా 2,000 మంది మరణించారని చెబుతున్నప్పటికీ… వెలుగులోకి వస్తున్న వీడియోలు కరోనా మరణాలు లక్షల్లో ఉంటాయా? […]

Update: 2020-02-19 03:14 GMT

చైనాలో పుట్టి ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా భారతదేశంలోకి ప్రవేశించి నెల రోజులు గడిచింది. కరోనా అనుమానితులను కేరళలో గుర్తించి వారికి చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత వారికి కరోనా తగ్గిందా? లేక కరోనా కారణంగా వారు మృత్యువాతపడ్డారా? అన్న వివరాలు మాత్రం తరువాత కనిపించలేదు.

ఇదే సమయంలో కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా మృతి కేసులు నమోదయ్యాయి. చైనాలో అధికారికంగా 2,000 మంది మరణించారని చెబుతున్నప్పటికీ… వెలుగులోకి వస్తున్న వీడియోలు కరోనా మరణాలు లక్షల్లో ఉంటాయా? అన్న అనుమానాలను రేపుతున్నాయి. కరోనాకు చికిత్సనందిస్తున్న నర్సులు, వైద్యులు మృత్యువాతపడుతున్నారు. కరోనా వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులు అదృశ్యమవుతున్నారు. అయినప్పటికీ కరోనాను కంట్రోల్ చేశామంటూ చైనా చెప్పుకుంటోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు కాలేదు. కరోనా అనుమానితులు పలువురు హైదరాబాదులోని ఫీవర్ ఆసుపత్రిలో చేరినప్పటికీ వారెవరికీ కరోనా సోకలేదని తేలింది. అంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు కరోనా మాట కూడా వినిపించలేదు. శ్రీకాకుళంలో ఒక వ్యక్తి కరోనా లక్షణాలతో మృతి చెందాడన్న పుకార్లు వినిపించిన తరువాత తాజాగా విశాఖలో రెండు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి.

విశాఖకు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని చైనాలో మెడిసిన్‌ మొదటి సంవత్సర చదువుతోంది. ఆమె ఈ నెల 16న వైజాగ్ వచ్చింది. డయేరియాతో బాధపడుతున్న ఆమెను ఛాతీ, అంటువ్యాధుల ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం డయేరియా అదుపులోకి వచ్చినా, ముందు జాగ్రత్త చర్యగా ఆమెను ఆసుపత్రిలోనే ఉంచారు. చైనాలో వైద్యవిద్యనభ్యసిస్తూ హౌస్ సర్జన్‌గా శిక్షణ పొందుతున్న మరో 23 ఏళ్ల యువతి కూడా కరోనా అనుమానంతో ఆసుపత్రిలో చేరింది. ఆమె చైనా నుంచి ఈ నెల ఎనిమిదిన వైజాగ్ వచ్చింది. దీంతో వారిద్దరినీ ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స నందిస్తున్నారు. వారి బ్లడ్ శాంపిల్స్‌ను కరోనా నిర్ధరణ కోసం హైదరాబాద్‌ పంపారు.

Tags:    

Similar News