ఏపీలో కరోనా @ 3,791

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ను కరోనా ఇప్పట్లో వదిలిపెట్టేలా కనిపించడం లేదు. రోజురోజుకీ తన విస్తృతి పెంచుకుంటున్న కరోనా కేసులు గత నాలుగు రోజులుగా భారీ మొత్తంలోనే నమోదవుతున్నాయి. డిశ్చార్జీలు అంతంతమాత్రంగానే ఉంటున్నప్పటికీ కేసుల నమోదు మాత్రం భారీగానే ఉంటోంది. ఏపీలో గడచిన 24 గంటల్లో 12,613 శాంపిళ్లను పరీక్షించగా 82 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో వివిధ ఆస్పత్రుల నుంచి 40 మంది కరోనా […]

Update: 2020-06-02 01:26 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ను కరోనా ఇప్పట్లో వదిలిపెట్టేలా కనిపించడం లేదు. రోజురోజుకీ తన విస్తృతి పెంచుకుంటున్న కరోనా కేసులు గత నాలుగు రోజులుగా భారీ మొత్తంలోనే నమోదవుతున్నాయి. డిశ్చార్జీలు అంతంతమాత్రంగానే ఉంటున్నప్పటికీ కేసుల నమోదు మాత్రం భారీగానే ఉంటోంది. ఏపీలో గడచిన 24 గంటల్లో 12,613 శాంపిళ్లను పరీక్షించగా 82 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో వివిధ ఆస్పత్రుల నుంచి 40 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది.

దానితో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు 33 మందికి కరోనా నిర్ధారణ అయిందని తెలిపింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 3,200 అని చెప్పింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి 3,791 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. 3200 పాజిటివ్ కేసుల్లో ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 927 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,209 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు ఏపీలో 64 మంది మృత్యువాతపడ్డారని తెలిపింది.

Tags:    

Similar News