ఏపీలో కరోనా @ 2,407

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. లాక్‌డౌన్ ఆంక్షలు సడలిస్తున్న కొద్దీ కేసుల సంఖ్య పెరిగుతోన్నది. గడచిన 24 గంటల్లో ఏపీలో 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2,407కి చేరుకుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 43 మంది డిశ్చార్జ్‌ అయ్యారని, కర్నూలులో ఒక్కరు మృతి చెందారని తెలిపింది. వివిధ ఆస్పత్రుల్లో 715 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు […]

Update: 2020-05-20 00:43 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. లాక్‌డౌన్ ఆంక్షలు సడలిస్తున్న కొద్దీ కేసుల సంఖ్య పెరిగుతోన్నది. గడచిన 24 గంటల్లో ఏపీలో 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2,407కి చేరుకుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 43 మంది డిశ్చార్జ్‌ అయ్యారని, కర్నూలులో ఒక్కరు మృతి చెందారని తెలిపింది. వివిధ ఆస్పత్రుల్లో 715 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,639 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా ఏపీలో ఇప్పటివరకు 53 మంది మృతిచెందారని ప్రకటించింది.

Tags:    

Similar News