ఏపీలో కరోనా @ 2,339
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టే పట్టి ఎక్కువవుతున్నాయి. ఒకవైపు వందల సంఖ్యలో ఆస్పత్రుల నుంచి కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అవుతుంటే… పదుల సంఖ్యలో కరోనా సోకుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా తగ్గుముఖం పడుతోన్నది అని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. ఏపీలో గడచిన 24 గంటల్లో 9,739 శాంపిళ్లను పరీక్షించగా మరో 57 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో […]
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టే పట్టి ఎక్కువవుతున్నాయి. ఒకవైపు వందల సంఖ్యలో ఆస్పత్రుల నుంచి కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అవుతుంటే… పదుల సంఖ్యలో కరోనా సోకుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా తగ్గుముఖం పడుతోన్నది అని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొన్నది.
ఏపీలో గడచిన 24 గంటల్లో 9,739 శాంపిళ్లను పరీక్షించగా మరో 57 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం 2,339 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 691 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,596 మంది డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారిలో చిత్తూరు జిల్లాలకు చెందిన వారు ఒకరు, కర్నూలు జిల్లాకు చెందిన వారు ఒకరు ఉన్నారు. దీంతో ఏపీలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 52కి చేరింది.
కాగా, ఏపీ ప్రతి రోజూ హెల్త్ బులెటిన్‌ను జిల్లాలో కేసుల వారీగా పట్టికను విడుదల చేసేది. గత కొంత కాలంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి నమోదైన కేసులంటూ పట్టిక కిందబాగంలో కొన్ని కేసులు ప్రస్తావించేది. ఇవి భారీ సంఖ్యలో ఉండేవి. దీంతో రెండు రకాల బులెటిన్‌లెందుకన్న ప్రశ్న ఉదయించేది. అయితే, తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో పట్టిక విడుదల చేయకపోవడం విశేషం.