బోనస్ ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

దిశ,సిద్దిపేట: ఖరీఫ్ లో సాగు చేసిన మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ప్రారంభించక పోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర 1850 రూపాయలు ఉందన్నారు. కాగా దళారులు గ్రామలలోకి వచ్చి రూ. 1000 నుండి 1200 మధ్య రైతు నుంచి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల రైతులు ఎకరానికి రూ.18000 వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు […]

Update: 2020-10-12 10:55 GMT

దిశ,సిద్దిపేట: ఖరీఫ్ లో సాగు చేసిన మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ప్రారంభించక పోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర 1850 రూపాయలు ఉందన్నారు. కాగా దళారులు గ్రామలలోకి వచ్చి రూ. 1000 నుండి 1200 మధ్య రైతు నుంచి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల రైతులు ఎకరానికి రూ.18000 వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర జాబితాలో మొక్కజొన్న ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే వాటిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతు ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే వారికి తూకం పట్టి ఇవ్వాలనీ అన్నారు. దాని ఆధారంగానే రైతుకు డబ్బులు ఇవ్వాలని అన్నారు. అలా చేయడం వలన రైతుల మీద రైస్ మిల్లర్ల పెత్తనం ఉండదన్నారు. కనీస మద్దతు ధర తోపాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ప్రభుత్వమే అన్ని రకాల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పంట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News