ట్విట్టర్ వేదికగా మాటల దాడి RS ప్రవీణ్ కుమార్ Vs కౌశిక్ రెడ్డి..
దిశ ప్రతినిధి, కరీంనగర్ : RS ప్రవీణ్ కుమార్, పాడి కౌశిక్ రెడ్డిలు ట్విట్టర్ వేదికగా కౌంటర్లు వేసుకుంటున్నారు. కౌశిక్ రెడ్డి ఇటీవల టీఆర్ఎస్‌లో చేరినప్పుడు ఆయనతో పాటు జాయిన్ అయ్యే వారిని వేదిక మీదకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన సంభోందించిన తీరును తప్పు పడుతూ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ‘కౌశిక్ బ్రదర్ మీరు ఆధిపత్య కులాలకు చెందిన నాయకులను గారు అని గౌరవించి పీడిత వర్గాలకు చెందిన వారిని మాత్రం ఏక వచనంతో […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : RS ప్రవీణ్ కుమార్, పాడి కౌశిక్ రెడ్డిలు ట్విట్టర్ వేదికగా కౌంటర్లు వేసుకుంటున్నారు. కౌశిక్ రెడ్డి ఇటీవల టీఆర్ఎస్‌లో చేరినప్పుడు ఆయనతో పాటు జాయిన్ అయ్యే వారిని వేదిక మీదకు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన సంభోందించిన తీరును తప్పు పడుతూ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ‘కౌశిక్ బ్రదర్ మీరు ఆధిపత్య కులాలకు చెందిన నాయకులను గారు అని గౌరవించి పీడిత వర్గాలకు చెందిన వారిని మాత్రం ఏక వచనంతో పిలిచారు. ఇది అభ్యంతరకం. ఇలాంటి దురహంకార భావజాలం వల్లనే జనాలు బహుజన రాజ్యం రావాలంటున్నారు’’ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఇందుకు కౌంటర్‌గా కౌశిక్ రెడ్డి కూడా ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు. ‘‘గౌరవ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరంటే నాకు గౌరవం ఉంది. మీ హోదాకి తగిన విమర్శలు చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా మిత్రులు బహుజన, దళిత బిడ్డలే. మీరు ఎవరో ఎడిట్ చేసిన వీడియోని పోస్ట్ చేసి మీ స్థాయిని మీరు తగ్గించుకున్నారు’’ అంటూ కామెంట్ చేశారు.
కౌశిక్ బ్రదర్, మీరు ఆధిపత్యకులాల నాయకులను ‘గారు’ అని గౌరవించి, పీడిత వర్గాలకు చెందిన వారిని మాత్రం ఏక వచనంతో పిలిచారు. ఇది అభ్యంతరకరం. ఇలాంటి దురహంకార భావజాలం వల్లనే జనాలు బహుజనరాజ్యం రావాలంటున్నరు. I am not against any particular caste, but we must stop this reckless framing. pic.twitter.com/jL3tOb6YIw
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) July 27, 2021
గౌరవ @RSPraveenSwaero గారు మీరంటే నాకు చాల గౌరవం ఉంది మీ హోదాకి తగిన విమర్శలు చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం.నేను పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు నా మిత్రులు బహుజన మరియు దళిత బిడ్డలే.
మీరు ఎవరో ఎడిట్ చేసిన వీడియోని పోస్ట్ చేసి మీ స్థాయిని మీరు తగ్గించుకున్నారు ! pic.twitter.com/lQnacoxiaU— Padi Kaushik Reddy (@KaushikReddyP9) July 27, 2021