వివాదంలో విజిలెన్స్ కమిషనర్ ఎన్నిక
కేంద్ర ప్రభుత్వం మంగళవారం కొత్త సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ), సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ)ను ప్రకటించింది. ఈ రెండు నామినేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా.. ప్రధాని నేతృత్వంలోని హైపవర్ కమిటీ కొత్త సీవీసీగా సంజయ్ కొఠారి, తరువాతి సీఐసీగా బీమల్ జుల్కాను ఎంపిక చేసింది. కొఠారి ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద కార్యదర్శిగా పనిచేస్తుండగా, జుల్కా సమాచార కమిషనర్‌గా పనిచేస్తున్నారు. కాగా సీవీసీ ఎంపిక ప్రక్రియ మొత్తం ప్రశ్నార్థకంగా ఉందంటూ కమిటీలోని ప్రతిపక్ష […]
కేంద్ర ప్రభుత్వం మంగళవారం కొత్త సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ), సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ)ను ప్రకటించింది. ఈ రెండు నామినేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా.. ప్రధాని నేతృత్వంలోని హైపవర్ కమిటీ కొత్త సీవీసీగా సంజయ్ కొఠారి, తరువాతి సీఐసీగా బీమల్ జుల్కాను ఎంపిక చేసింది. కొఠారి ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద కార్యదర్శిగా పనిచేస్తుండగా, జుల్కా సమాచార కమిషనర్‌గా పనిచేస్తున్నారు. కాగా సీవీసీ ఎంపిక ప్రక్రియ మొత్తం ప్రశ్నార్థకంగా ఉందంటూ కమిటీలోని ప్రతిపక్ష సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి ఎద్దేవా చేశారు. ఎంపిక కమిటీలో సభ్యులుగా ఉన్న ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ కూడా సీవీసీ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తేలడంతో పాటు సెర్చ్ కమిటీ ఎంపిక చేసిన తుది జాబితాలో ఉండటం గమనార్హం. అయితే కమిటీలోని ప్రతిపక్ష సభ్యుడి విమర్శల కారణంగానే తుది జాబితాలోని 126 మంది అభ్యర్థుల నుంచి రాజీవ్ కుమార్‌ను తప్పించినట్టు టెలిగ్రాఫ్ వెల్లడించింది.