సీబీఐ కేసు.. వివాదంలో ఎంపీ కవిత

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ ఎంపీ పీఏలమంటూ ముగ్గురు వ్యక్తులు ఏకంగా దేశరాజధానిలో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. బెదిరించి మరీ లక్షల రూపాయలను దోచుకున్నారు. పూర్తి వివరాళ్లోకి వెళితే.. ఢిల్లీలోని ఓ ఇంటి యజమాని వద్దకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు(రాజీబ్ భట్టా చార్య, సుభాంగిగుప్తా, దుర్గేష్ కుమార్‌) ఎంపీ మాలోతు కవిత పీఏలమంటూ అతడిని బెదిరించారు. ఇళ్లు అక్రమ నిర్మాణం అంటూ డబ్బులు డిమాండ్ చేశారు. రూ. 5 లక్షలు […]

Update: 2021-04-01 06:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ ఎంపీ పీఏలమంటూ ముగ్గురు వ్యక్తులు ఏకంగా దేశరాజధానిలో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. బెదిరించి మరీ లక్షల రూపాయలను దోచుకున్నారు. పూర్తి వివరాళ్లోకి వెళితే.. ఢిల్లీలోని ఓ ఇంటి యజమాని వద్దకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు(రాజీబ్ భట్టా చార్య, సుభాంగిగుప్తా, దుర్గేష్ కుమార్‌) ఎంపీ మాలోతు కవిత పీఏలమంటూ అతడిని బెదిరించారు. ఇళ్లు అక్రమ నిర్మాణం అంటూ డబ్బులు డిమాండ్ చేశారు. రూ. 5 లక్షలు డిమాండ్ చేయడంతో దిక్కుతోచని మన్మిత్‌సింగ్‌ లంబా (బాధితుడు) సీబీఐని ఆశ్రయించాడు. దీంతో పథకం ప్రకారం సరిగ్గా డబ్బులు ఇచ్చే సమయంలో సీబీఐ దాడులు చేసింది. సదరు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతుండగా.. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News