కేసీఆర్ అసిస్టెంట్ అంట.. సిద్దిపేట కలెక్టర్ ఇప్పుడేం చెబుతారు..!
దిశ ప్రతినిధి, మెదక్: జిల్లా ప్రజలకు సేవలందించాల్సిన కలెక్టర్ గత వారం రోజులుగా పలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మొన్న సీఎం పర్యటన సందర్భంగా కలెక్టరేట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు. మాస్కు ధరించకుండానే మంత్రి, సీపీతో కలిసి అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం సిద్దిపేట పర్యటన రోజున సైతం కలెక్టర్ చాంబర్ ప్రారంభించిన అనంతరం సీఎం తన కుర్చీలో కూర్చోబెట్టిన సందర్భంలో ముఖ్యమంత్రి కాళ్లు మొక్కడంతో రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. సిద్దిపేట కలెక్టర్‌కు అక్కడేం […]
దిశ ప్రతినిధి, మెదక్: జిల్లా ప్రజలకు సేవలందించాల్సిన కలెక్టర్ గత వారం రోజులుగా పలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మొన్న సీఎం పర్యటన సందర్భంగా కలెక్టరేట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు. మాస్కు ధరించకుండానే మంత్రి, సీపీతో కలిసి అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం సిద్దిపేట పర్యటన రోజున సైతం కలెక్టర్ చాంబర్ ప్రారంభించిన అనంతరం సీఎం తన కుర్చీలో కూర్చోబెట్టిన సందర్భంలో ముఖ్యమంత్రి కాళ్లు మొక్కడంతో రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
సిద్దిపేట కలెక్టర్‌కు అక్కడేం పని..
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం రోజున సీఎం పర్యటించిన వాసాలమర్రి గ్రామంలోనూ సిద్దిపేట కలెక్టర్ పాల్గొనడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సిద్దిపేట కలెక్టర్‌కు నల్గొండలో ఏమి పని, సీఎం ఎక్కడ ఉంటే కలెక్టర్ అక్కడ ఉంటాడా..? అని కొందరు కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు జిల్లా కలెక్టరా.. లేక సీఎంకు పర్సనల్ అసిస్టెంట్ హా అంటూ ఘాటైన విమర్శలు చేస్తున్నారు.
సీఎం అంతకుముందు దత్తత తీసుకున్న మరో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ వెంకట్రామిరెడ్డి దగ్గురుండి పర్యవేక్షించారు. దీంతో ఆయనను స్ఫూర్తిగా తీసుకొని అక్కడి ప్రజలు అభివృద్ధి చేసుకోవాలని గుర్తు చేసేందుకే కేసీఆర్ సిద్దిపేట కలెక్టర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారని ముచ్చటించుకుంటున్నారు. మొత్తానికి సిద్దిపేట కలెక్టర్ గత వారం రోజులుగా వివాదాల్లో చిక్కుకోవడం, వాటికి సమాధానం చెప్పుకోవడానికే సరిపోతుంది. మరి ఈ వాసలమర్రి విషయంపై ఎలాంటి సమాధానామిస్తారో వేచి చూడాలి.