ఈఎస్ఐ ఆసుపత్రి సిబ్బంది ధర్నా

దిశ ప్రతినిది, మేడ్చల్: నాచారం ఈఎస్ఐ ఆసుపత్రి కాంట్రాక్ట్ వర్కర్స్ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.నర్సింహా డిమాండ్ చేశారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా నర్సింహా మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ సిబ్బంది నాలుగు నెలల బకాయి జీతాలను చెల్లించాలని, క్వారంటైన్ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కోవిడ్ విధులు నిర్వహిస్తున్న వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ […]

Update: 2020-08-14 07:17 GMT

దిశ ప్రతినిది, మేడ్చల్: నాచారం ఈఎస్ఐ ఆసుపత్రి కాంట్రాక్ట్ వర్కర్స్ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.నర్సింహా డిమాండ్ చేశారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా నర్సింహా మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ సిబ్బంది నాలుగు నెలల బకాయి జీతాలను చెల్లించాలని, క్వారంటైన్ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కోవిడ్ విధులు నిర్వహిస్తున్న వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ధన్ రామ్, భాస్కరచారి, సునీత ,లక్ష్మీ, స్వరూప, లీల తదతరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News