కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల ధర్నా
దిశ, హైదరాబాద్: కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలకు ఎంపిక చేసి.. చివరికి ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగంలో చేరమనడం దారుణమని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు మండిపడ్డారు. ఈ మేరకు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు సోమవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తీరును నిరసిస్తూ.. కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. టిమ్స్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో స్టాఫ్ నర్సులు కావాలని అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసి 246 మందిని ఎంపిక చేశారు. వీరిలో 30 మంది స్టాఫ్ […]
దిశ, హైదరాబాద్: కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలకు ఎంపిక చేసి.. చివరికి ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగంలో చేరమనడం దారుణమని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు మండిపడ్డారు. ఈ మేరకు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు సోమవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తీరును నిరసిస్తూ.. కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు.
టిమ్స్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో స్టాఫ్ నర్సులు కావాలని అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసి 246 మందిని ఎంపిక చేశారు. వీరిలో 30 మంది స్టాఫ్ నర్సులను గాంధీ హాస్పిటల్లో విధులకు చేరాలని సూచించడంతో వారు సోమవారం గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. సుమారు నాలుగు గంటల నిరీక్షణ అనంతరం ఆస్పత్రికి చెందిన ఓ మహిళా అధికారి వచ్చి ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేయాల్సి ఉంటుందని చెప్పంది. దీంతో వారు ఆమెతో వాగ్వాదానికి దిగారు. అనంతం స్టాఫ్ నర్సులు కోఠికి చేరుకుని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయ ముట్టడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని స్టాఫ్ నర్సులు ప్రకటించారు.