2022 కల్లా రామమందిర నిర్మాణం పూర్తి
అయోధ్యలో 2022 కల్లా రామ మందిరాన్ని నిర్మిస్తామని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ కామేశ్వర్ చౌపాల్ వెల్లడించారు. 19న ప్రయగరాజ్ లో అయోధ్య ఆలయ కమిటీ మొదటిసారి సమావేశం అవుతుందన్నారు. ఈ భేటీలో ఆలయ నిర్మాణం, శంకుస్థాపన కార్యక్రమాలపై ట్రస్ట్ ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం 67 ఎకరాల స్థలం కేటాయించారని, అయితే ఇది సరిపోదని, ఇంకా ఎక్కువ స్థలం కావాలని ఆయన కోరారు. రామమందిర నిర్మాణ […]
అయోధ్యలో 2022 కల్లా రామ మందిరాన్ని నిర్మిస్తామని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ కామేశ్వర్ చౌపాల్ వెల్లడించారు. 19న ప్రయగరాజ్ లో అయోధ్య ఆలయ కమిటీ మొదటిసారి సమావేశం అవుతుందన్నారు. ఈ భేటీలో ఆలయ నిర్మాణం, శంకుస్థాపన కార్యక్రమాలపై ట్రస్ట్ ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం 67 ఎకరాల స్థలం కేటాయించారని, అయితే ఇది సరిపోదని, ఇంకా ఎక్కువ స్థలం కావాలని ఆయన కోరారు. రామమందిర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని కామేశ్వర్ వెల్లడించారు.