మహిళా కానిస్టేబుల్‌తో ఎఫైర్… పోలీసు కానిస్టేబుల్ సస్పెండ్
దిశ, రాయలసీమ: మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న కేసులో అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం తగరకుంటకు చెందిన కానిస్టేబుల్ హర్షవర్ధన్ రాజును ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్‌లో హర్షవర్దన్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం కళ్యాణదుర్గంకు చెందిన ఓ మహిళతో అతనికి పెళ్లైంది. అయితే పెళ్లికి ముందే హర్షవర్ధన్ ఒక మహిళా కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లైన కొన్నాళ్ల నుంచి మహిళా కానిస్టేబుల్ ను ఇంటికి […]
దిశ, రాయలసీమ: మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న కేసులో అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం తగరకుంటకు చెందిన కానిస్టేబుల్ హర్షవర్ధన్ రాజును ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్‌లో హర్షవర్దన్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం కళ్యాణదుర్గంకు చెందిన ఓ మహిళతో అతనికి పెళ్లైంది. అయితే పెళ్లికి ముందే హర్షవర్ధన్ ఒక మహిళా కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లైన కొన్నాళ్ల నుంచి మహిళా కానిస్టేబుల్ ను ఇంటికి తీసుకువెళ్లటం ప్రారంభించాడు.
తనకు చెల్లెలు అవుతుందని భార్యను నమ్మించాడు. అయితే కొద్దిరోజుల తర్వాత హర్షవర్దన్ రాజు ఆమెతో ప్రవర్తించే తీరుతో భార్యకు అనుమానం వచ్చింది. దీంతో భర్తను నిలదీయగా అసలు విషయం బయటపడింది. భర్త తీరు మారకపోవడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా మహిళా కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం నడుపుతుండటంతో బ్రహ్మసముద్రం పోలీసులకు బంధువులు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసుస్టేషన్ ఎస్సై కేసు నమోదు చేసుకుని ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్పీ ఈ కేసుపై విచారణకు ఆదేశించగా.. నివేదికలో వివాహేతర సంబంధం నిజమని తేలింది. దీంతో హర్షవర్ధన్ రాజుతో పాటు మహిళా కానిస్టేబుల్ పై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.