చలివాగులో కానిస్టేబుల్ గల్లంతు
దిశ, వెబ్‌డెస్క్: వాగులో ఈతకు వెళ్లిన కానిస్టేబుల్ గల్లంతైన సంఘటన వరంగల్ రూరల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా మామునూరు టీఎస్పీ బెటాలియన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రీధర్ పరకాలకు బంధువుల ఇంటికి వచ్చాడు. ఇదేక్రమంలో పరకాల పట్టణ శివారులోని చలివాగులోకి ఈతకు వెళ్లగా… వరద ఉధృతిలో కొట్టుకు పోయాడు. వెంటనే బంధువులు పోలీసులకు సమాచారం అందించగా స్థానికులతో కలిసి గాలిస్తున్నారు. కానిస్టేబుల్ శ్రీధర్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.