కాంగ్రెస్ పార్టీకి షాక్.. కీలక నేత రాజీనామా
దిశ ఖమ్మం టౌన్: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన కాంగ్రెస్.. సరిగా కోలుకోకముందే మరో ఊహించని షాక్ తగిలింది. ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 45వ డివిజన్ నుంచి పోటీ చేసి పార్టీ నేత దీపక్ చౌదరి ఓటమి పాలయ్యాడు. దీంతో ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ, ప్రజల తీర్పును అంగీకరిస్తూ, ప్రస్తుత రాజకీయాలకు తన మనస్తత్వం సరిపోదని భావిస్తూ.. రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటున్నానని దీపక్ చౌదరి […]
దిశ ఖమ్మం టౌన్: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన కాంగ్రెస్.. సరిగా కోలుకోకముందే మరో ఊహించని షాక్ తగిలింది. ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 45వ డివిజన్ నుంచి పోటీ చేసి పార్టీ నేత దీపక్ చౌదరి ఓటమి పాలయ్యాడు. దీంతో ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ, ప్రజల తీర్పును అంగీకరిస్తూ, ప్రస్తుత రాజకీయాలకు తన మనస్తత్వం సరిపోదని భావిస్తూ.. రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటున్నానని దీపక్ చౌదరి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు ఇప్పటికే జిల్లా పార్టీ కార్యాలయానికి లేఖ రాశారు.
‘‘రాజకీయల నుండి తప్పుకోదలచుకున్నాను. ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీ తనకు మంచి అవకాశాలు ఇచ్చింది. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు. పార్టీలో వున్న వారికి మంచి భవిష్యత్తు ఉంది. ప్రస్తుతం ఖమ్మం నగర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. నా రాజీనామా పత్రాన్ని ఆమోదించాలని కోరుతున్నాను.’’ అని లేఖలో పేర్కొన్నారు.