ఇవాళ అక్కడికి రాహుల్, ప్రియాంక వెళ్తున్నారు కానీ,.. సోనియా గాంధీ వెళ్లడంలేదు!
దిశ, వెబ్ డెస్క్: కేంద్రంలో, మిగిలిన రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఇందుకు సంబంధించి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు సీనియర్ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ జైపూర్ లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు ఇతర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సీనియర్ లీడర్లు పాల్గొననున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, కూరగాయలు సహా […]
దిశ, వెబ్ డెస్క్: కేంద్రంలో, మిగిలిన రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఇందుకు సంబంధించి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు సీనియర్ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ జైపూర్ లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు ఇతర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సీనియర్ లీడర్లు పాల్గొననున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, కూరగాయలు సహా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంపై కేంద్రాన్ని ఈ ర్యాలీలో నిలదీయనున్నారు. అయితే, ఈ ర్యాలీలో సోనియా గాంధీ మాత్రం పాల్గొనడంలేదని సమాచారం. ర్యాలీని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేతలు మాట్లాడుతూ.. నేడు నిర్వహించబోయే ర్యాలీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ పతనానికి కారణమవుతుందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని చెప్పారు.