పీఎం మోడీపై రాహుల్ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం ఖూనీ చేస్తోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. జమ్మూ కాశ్మీర్‌లో గతేడాది నుంచి వందలాది రాజకీయ నాయకులను నిర్బంధంలో ఉంచారని ఆయన ఆరోపించారు. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) నేత, మాజీ సీఎం కూడా అయిన మెహబూబా ముఫ్తీతో పాటు మిగతా వారిని కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదీ కాలంగా వీరంతా నిర్బంధంలోనే మగ్గుతున్నారని, ఇంకా ఎంతకాలం వీరిని ఇలా శిక్షిస్తారని […]
దిశ, వెబ్‌డెస్క్ :
దేశంలో ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం ఖూనీ చేస్తోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. జమ్మూ కాశ్మీర్‌లో గతేడాది నుంచి వందలాది రాజకీయ నాయకులను నిర్బంధంలో ఉంచారని ఆయన ఆరోపించారు.
పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) నేత, మాజీ సీఎం కూడా అయిన మెహబూబా ముఫ్తీతో పాటు మిగతా వారిని కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదీ కాలంగా వీరంతా నిర్బంధంలోనే మగ్గుతున్నారని, ఇంకా ఎంతకాలం వీరిని ఇలా శిక్షిస్తారని ఆయన ప్రశ్నించారు.
ముఫ్తీ సహచర నేత అయిన సజాద్ ఘనీని ప్రభుత్వం విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ముఫ్తీ నిర్బంధ కాలాన్ని మళ్ళీ పొడిగించడాన్ని కాంగ్రెస్ మరో సీనియర్ నేత పి. చిదంబరం కూడా తీవ్రంగా తప్పుబట్టారు. 61 ఏళ్ళ మాజీ సీఎం, ప్రజాదరణ కలిగిన వ్యక్తిని నిరంతరం సాయుధ గార్డుల కాపలాలో ఉంచుతారా? అని ఆయన మండిపడ్డారు.