రాష్ట్రపతిని కలిసిన సోనియా గాంధీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ సీనియర్ నేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న అల్లర్ల గురించి వివరించారు. కాంగ్రెస్ డిమాండ్లకు సంబంధించిన మెమోరాండంను గురువారం సమర్పించారు. ఢిల్లీలో శాంతి నెలకొల్పాలని కోరారు. సోనియా గాంధీతోపాటు మన్మోహన్ సింగ్, గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, రణదీప్ సుర్జేవాలాలు వెళ్లారు. కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వం.. ఢిల్లీ అల్లర్లు జరుగుతుంటే మౌనం వహించాయని సోనియా గాంధీ ఆరోపించారు. తమ డిమాండ్లను రాష్ట్రపతికి […]

Update: 2020-02-27 02:44 GMT

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ సీనియర్ నేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న అల్లర్ల గురించి వివరించారు. కాంగ్రెస్ డిమాండ్లకు సంబంధించిన మెమోరాండంను గురువారం సమర్పించారు. ఢిల్లీలో శాంతి నెలకొల్పాలని కోరారు. సోనియా గాంధీతోపాటు మన్మోహన్ సింగ్, గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, రణదీప్ సుర్జేవాలాలు వెళ్లారు. కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వం.. ఢిల్లీ అల్లర్లు జరుగుతుంటే మౌనం వహించాయని సోనియా గాంధీ ఆరోపించారు. తమ డిమాండ్లను రాష్ట్రపతికి అందజేశామని విలేకరుల తెలిపారు. తప్పక వాటిని పరిశీలిస్తానని రాష్ట్రపతి తెలిపారని వివరించారు. కాగా, ఈ అల్లర్లు దేశానికే సిగ్గుచేటు అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News