అసమ్మతి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ వార్నింగ్

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్‌లో రాజకీయం మరింత హీటెక్కింది. సీఎం అశోక్ గెహ్లాట్‌ ప్రభుత్వానికి ఎదురుతిరిగిన అసమ్మతి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ అధిష్టానం వార్నింగ్ ఇచ్చింది. ఎమ్మెల్యేలు సొంత గూటికి చేరకపోతే వారిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశామని తెలిపింది. ఈ మేరకు పార్టీ ఆదేశాలను ధిక్కరించి సీఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టిన డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీనేత సచిన్ పైలట్‌ను పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే..తాజాగా పైలట్ కు మద్దతుగా ఉన్న […]

Update: 2020-07-16 00:05 GMT

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్‌లో రాజకీయం మరింత హీటెక్కింది. సీఎం అశోక్ గెహ్లాట్‌ ప్రభుత్వానికి ఎదురుతిరిగిన అసమ్మతి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ అధిష్టానం వార్నింగ్ ఇచ్చింది. ఎమ్మెల్యేలు సొంత గూటికి చేరకపోతే వారిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశామని తెలిపింది. ఈ మేరకు పార్టీ ఆదేశాలను ధిక్కరించి సీఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టిన డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీనేత సచిన్ పైలట్‌ను పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే..తాజాగా పైలట్ కు మద్దతుగా ఉన్న 18 మంది ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకోకపోతే వారి శాసనసభ సభ్యత్వాలను రద్దు చేసేందుకు స్పీకర్ ద్వారా కాంగ్రెస్ నోటీసులు ఇప్పించింది.

Tags:    

Similar News