పోలవరం నిధుల కోసం పోరాడతాం : శైలజానాథ్

దిశ, ఏపీబ్యూరో: పోలవరం ప్రాజెక్టు తాజా అంచనాల ప్రకారం నిధులు రాబట్టేందుకు కేంద్రంపై అన్ని పక్షాలను కలుపుకొని పోరాడతామని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్​ అన్నారు. శుక్రవారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరంపై కేంద్రం దగా చేస్తుంటే సీఎం జగన్​ నిమ్మకు నీరెత్తినట్లున్నారని చెప్పారు. ఇదేదో సొంతింటి వ్యవహారంలో పాలన సాగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. రైతుల వ్యతిరేక పాలన సాగుతోందన్నారు ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో పీసీసీ మాజీ […]

Update: 2020-10-30 10:24 GMT

దిశ, ఏపీబ్యూరో: పోలవరం ప్రాజెక్టు తాజా అంచనాల ప్రకారం నిధులు రాబట్టేందుకు కేంద్రంపై అన్ని పక్షాలను కలుపుకొని పోరాడతామని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్​ అన్నారు. శుక్రవారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరంపై కేంద్రం దగా చేస్తుంటే సీఎం జగన్​ నిమ్మకు నీరెత్తినట్లున్నారని చెప్పారు. ఇదేదో సొంతింటి వ్యవహారంలో పాలన సాగుతుందన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. రైతుల వ్యతిరేక పాలన సాగుతోందన్నారు ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు తులసిరెడ్డి మాట్లాడారు.

Tags:    

Similar News