దుబ్బాక నుంచే టీఆర్ఎస్ పతనం

దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక ఉపఎన్నికల నుంచే రాష్ట్ర సీఎం కేసీఆర్‎కు పతనం ప్రారంభమైందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యేలు సురేష్ షెట్కార్, తూంకుంట నర్సారెడ్డి , శ్రీశైలం గౌడ్, బలరాం నాయక్, కాంగ్రెస్ నాయకులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నిక నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష […]

Update: 2020-10-07 08:11 GMT

దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక ఉపఎన్నికల నుంచే రాష్ట్ర సీఎం కేసీఆర్‎కు పతనం ప్రారంభమైందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యేలు సురేష్ షెట్కార్, తూంకుంట నర్సారెడ్డి , శ్రీశైలం గౌడ్, బలరాం నాయక్, కాంగ్రెస్ నాయకులు పలువురు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నిక నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అన్నారు. సీఎం కేసీఆర్ ఎలక్షన్స్‎ను కలెక్షన్స్‎గా మార్చారని ఆరోపించారు. ముత్యంరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప, రామలింగారెడ్డి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి మంచోడైతే దుబ్బాకకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గతంలో నారాయణఖేడ్, సిద్దిపేట రెండు కళ్లలాంటివి అంటూ మోసం చేసిన మంత్రి హరీష్ రావు.. ఇప్పుడు దుబ్బాక, సిద్దిపేట రెండు కళ్లలాంటివి అంటూ అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు.

Tags:    

Similar News