కమలం బాటలో కాంగ్రెస్ నేతలు

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలను చూసి కాంగ్రెస్ నాయకులు అంతర్మథనంలో పడ్డారు. రోజురోజుకు పార్టీ రాష్ట్రంలో బలహీనపడుతున్న నేపథ్యంలో  సీనియర్ నాయకులు పార్టీ మారేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ కు బలమైన ప్రతిపక్షం అవసరమని రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ కి ప్రజల ఆదరణ లభిస్తుంది. మొన్న దుబ్బాక… నిన్న గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ బలం పుంజుకోవడంతో కాంగ్రెస్ నాయకుల దృష్టి అటువైపు మళ్లింది. పీసీపీ చీఫ్ ని […]

Update: 2020-12-05 23:10 GMT

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలను చూసి కాంగ్రెస్ నాయకులు అంతర్మథనంలో పడ్డారు. రోజురోజుకు పార్టీ రాష్ట్రంలో బలహీనపడుతున్న నేపథ్యంలో సీనియర్ నాయకులు పార్టీ మారేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ కు బలమైన ప్రతిపక్షం అవసరమని రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ కి ప్రజల ఆదరణ లభిస్తుంది. మొన్న దుబ్బాక… నిన్న గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ బలం పుంజుకోవడంతో కాంగ్రెస్ నాయకుల దృష్టి అటువైపు మళ్లింది. పీసీపీ చీఫ్ ని మారుస్తున్నప్పటికీ కాంగ్రెస్ బలపడుతుందనే ధైర్యం నాయకుల్లో సన్నగిల్లింది. కార్యకర్తలల్లో ఉన్న ధైర్యం పార్టీ నాయకులకు లేదనే ప్రచారం సాగుతోంది.

పార్టీ మారితేనే భవిష్యత్..

రాష్ట్రంలోని రాజకీయాల ట్రెండ్‎ను బట్టి నేతలు పార్టీలు మారుతున్నారు. పదవులే లక్ష్యంగా నాయకులు ఎన్నికల్లో వస్తున్న పార్టీలు ఆదరణను చూసి పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రజాప్రతినిధులుగా ఒక పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీలోకి వెళ్తున్నారు. దీంతో నాయకుల్లో స్థిరమైన ఆలోచనలు లేకపోవడం, వ్యక్తిగత అవసరాల కోసం పార్టీలు మారుతున్న నేతలు చాలా మంది ఉన్నారు. పేరుకు మాత్రం పార్టీ బలహీనపడుతుందని, పార్టీ చీఫ్ వైఫల్యం అంటూ ఆరోపణలు చేస్తూ వలసలకు ప్రాధాన్యతనిస్తున్నారు. చివరికి పార్టీ మారే నాయకులు మా భవిష్యత్ అని సాకులు చెపుతున్నారు.

టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతను సొంతం చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి మరో కోణంలో ప్రజల ఆలోచన చేస్తున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నారు. కానీ గ్రేటర్ ఎన్నికల్లో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ఒక స్థానాన్ని కూడా అధికార పార్టీ దక్కించు కోలేదు.అంటే కేవలం అధికార పార్టీ ఎదుర్కొనే శక్తి బీజేపీ అని ప్రజలు గుర్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఐక్యత, స్థిరత్వం లేకపోవడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పార్టీ లు మారే ప్రజాప్రతినిధులకు మద్దతు ఉండబోదని స్పష్టం చేస్తూ బీజేపీని బలపరుస్తున్నారు. దీంతోనే బీజేపీ బలపడుతుందని తెలుస్తోంది. అందుకు నిదర్శనం మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీ మారినప్పటికీ తమ నియోజకవర్గంలోని ఏ ఒక్క డివిజన్ కూడా వాళ్ల గెలిపించుకోలేక పోయారు.

అందరూ అటు వైపు..

రంగారెడ్డి జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్ నేతలు బీజేపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. చేవెళ్ల, షాద్ నగర్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గం లోని ద్వితీయ శ్రేణి నాయకులంతా క మలం వైపు చూస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది.అంతేకాకుండా రంగా రెడ్డి జిల్లాలో పార్టీని బలో పేతం చేసేందుకు కాంగ్రెస్ లో బలమైన నాయకులు లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ వైపు వెళ్లడం మంచిదనే చర్చసాగుతోంది. ఈ నాయకులు ఎప్పుడు చేరతారా స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్ నాయకులు బీజేపీ లో ఉన్న సన్నిహితులతో మంత నాలు జరుపుతున్నట్లు సమాచారం.

Tags:    

Similar News