రేవంత్ సభకు భారీగా ఏర్పాట్లు.. సర్‌ప్రైజ్ ఇస్తామంటున్న కాంగ్రెస్ నేతలు

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ : ఇబ్రహీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఈనెల 18న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి త‌ల‌పెట్టిన ద‌ళిత గిరిజ‌న దండోరా బ‌హిరంగ స‌భ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి అన్నీ తానై ఏర్పాట్లను ప‌ర్యవేక్షిస్తున్నారు. శ‌నివారం రోజున తుర్కయంజాల్‌, ఇబ్రహీంప‌ట్నంలో నాయ‌కులు, కార్యక‌ర్తల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి పాల్గొన‌బోతున్న బ‌హిరంగ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నామ‌న్నారు. స‌భ‌ను క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో విజ‌య‌వంతం చేసి, […]

Update: 2021-08-14 08:18 GMT

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ : ఇబ్రహీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఈనెల 18న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి త‌ల‌పెట్టిన ద‌ళిత గిరిజ‌న దండోరా బ‌హిరంగ స‌భ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి అన్నీ తానై ఏర్పాట్లను ప‌ర్యవేక్షిస్తున్నారు. శ‌నివారం రోజున తుర్కయంజాల్‌, ఇబ్రహీంప‌ట్నంలో నాయ‌కులు, కార్యక‌ర్తల‌తో స‌మావేశ‌మ‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి పాల్గొన‌బోతున్న బ‌హిరంగ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నామ‌న్నారు. స‌భ‌ను క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో విజ‌య‌వంతం చేసి, రేవంత్‌కు బ‌హుమ‌తిగా అంద‌జేస్తామ‌న్నారు. నాయ‌కులు, కార్యక‌ర్తలందరూ బాధ్యత‌గా భావించి జ‌నస‌మీక‌ర‌ణ‌పై దృష్టిసారించాల‌ని పిలుపునిచ్చారు.

ప్రతీ కార్యక‌ర్త 50మందికి పైగా జ‌నాల‌ను స‌మీక‌రించాల‌ని సూచించారు. అనంత‌రం రావిరాల‌లో సభా స్థలిని స్థానిక నేత‌ల‌తో క‌లిసి ప‌ర్యవేక్షించారు. స‌భా ప్రాంగ‌ణం, వాహ‌నాల పార్కింగ్‌, మౌలిక వ‌స‌తుల ఏర్పాట్లపై ప‌లు సూచ‌న‌లు చేశారు. స‌భ‌కు వ‌చ్చేవారికి ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూడాల‌న్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు మ‌ల్‌రెడ్డి రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు న‌ర్సింహారెడ్డి, కాంగ్రెస్ మ‌హేశ్వరం ఇన్‌చార్జ్ దేప భాస్కర్‌రెడ్డి, చిలుక మ‌ధుసూద‌న్‌రెడ్డి, ఇబ్రహీంప‌ట్నం జడ్పీటీసీ భూప‌తిగ‌ళ్ల మ‌హిపాల్‌, అబ్దుల్లాపూర్‌మెట్ ఎంపీపీ బుర్ర రేఖ మ‌హేంద‌ర్‌గౌడ్‌, ఇత‌ర నేత‌లు పాల్గొన్నారు.

 

Tags:    

Similar News